Samantha, Allu Arjun: యాక్టింగ్ బీస్ట్ అంటూ బన్నీపై సమంత కామెంట్స్.. ఏం జరిగిందంటే?

  • March 5, 2024 / 03:02 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న హీరోయిన్లలో సమంత ఒకరు కాగా వేర్వేరు కారణాల వల్ల సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. సమంత త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. ఒక సందర్భంలో సమంత బన్నీ గురించి కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నటనలో మీకు స్పూర్తి ఎవరు అనే ప్రశ్నకు సమంత స్పందిస్తూ ఈ కామెంట్లు చేశారు.

యాక్టింగ్ లో నాకు అల్లు అర్జున్ స్పూర్తి అని ఆమె తెలిపారు. అల్లు అర్జున్ తో కలిసి మరోసారి నటించాలని అనుకుంటున్నానని సమంత చెప్పుకొచ్చారు. ఎందుకంటే అల్లు అర్జున్ యాక్టింగ్ బీస్ట్ గా ట్రాన్స్ ఫార్మ్ అయ్యాడని ఆమె కామెంట్లు చేశారు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో బన్నీ, సమంత కలిసి నటించడం జరిగింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేయగా ఆ సాంగ్ ఏ రేంజ్ లో హిట్టైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించడంలో ఆ సాంగ్ కీలక పాత్ర పోషించింది. పుష్ప ది రూల్ లో కూడా సమంత స్పెషల్ సాంగ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

సమంత (Samantha) తాజాగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. సమంత కెరీర్ ప్లానింగ్స్ భారీ స్థాయిలో ఉన్నాయని ఆమె త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. సామ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సామ్ ఇప్పటివరకు సీనియర్ హీరోలకు జోడీగా నటించలేదు. రాబోయే రోజుల్లో సామ్ సీనియర్ హీరోలకు జోడీగా నటించడానికి ఆసక్తి చూపిస్తారేమో చూడాలి.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus