Samantha: ఆ స్టార్ తో నటించాలని ఉందన్న సమంత.. ఆమె కోరిక తీరుతుందా?

  • April 3, 2023 / 02:30 PM IST

స్టార్ హీరోయిన్ సమంత శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెల్లడిస్తున్న విషయాలు అభిమానులను ఒకింత షాక్ కు గురి చేస్తున్నాయి. సమంత ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలతో కలిసి నటించి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఫహద్ ఫాజిల్ తో ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించాలని ఉందని సమంత వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. సమంత ఇప్పటికే ఫహద్ ఫాజిల్ తో కలిసి ఒక సినిమాలో నటించగా సామ్ మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్ లో ఫహద్ తో కలిసి నటించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఫహద్ ఫాజిల్ తన డ్రీమ్ హీరో అని సమంత పరోక్షంగా చెప్పుకొచ్చారు. సూపర్ డీలక్స్ లో ఫహద్ తో నటించినా అది తనకు చాలదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. మలయాళంలో నేరుగా ఎప్పుడు సినిమా చేస్తారనే ప్రశ్నకు సమంత ఈ విషయం వెల్లడించారు. మలయాళ సినిమాలను చూసి చాలా విషయాలను నేర్చుకున్నానని ఆమె తెలిపారు. మలయాళంలో కచ్చితంగా మూవీ చేస్తానని అయితే ఆ సినిమాలో ఫహద్ ఫాజిల్ హీరోగా నటిస్తే హ్యాపీ అని సమంత అభిప్రాయం వ్యక్తం చేశారు.

శాకుంతలం సినిమాలో అల్లు అర్హ కీలక పాత్రలో నటించడంతో అల్లు ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సమాచారం అందుతోంది. పాన్ ఇండియా మూవీగా సమంత నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ అవుతుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

యశోద తర్వాత సమంత (Samantha) నటించి విడుదలవుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. సమంత పారితోషికం 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా సమంత ప్రాజెక్ట్ లకు డిమాండ్ పెరుగుతోంది. కెరీర్ విషయంలో సమంత ఆచితూచి అడుగులు వేస్తుండటం గమనార్హం.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus