టాలీవుడ్ కి గోల్డెన్ డేస్ అంటున్న సమంత!
- August 29, 2017 / 06:07 AM ISTByFilmy Focus
టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న నటుల్లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఒకరు. మంచి యాక్టర్ గా అందరినీ తన యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్న ఈ యువ హీరో నటించిన ‘అర్జున్ రెడ్డి’ టాలీవుడ్ సెన్సేషన్ గా మారిపోవడంతో ఈ సినిమాకు టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు కూడ వరస పెట్టి వచ్చేస్తున్నాయి. ఈసినిమాకు ఏర్పడిన క్రేజ్ రీత్యా ఈ మూవీ కలెక్షన్స్ పరంగా సంచలనాలు సృట్టిస్తూ ఈమూవీ విడుదల అయిన మూడు రోజులకే ఈ సినిమాను కొనుక్కున్న బయ్యర్లను లాభాల్లోకి తీసుకు వచ్చింది అన్నవార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకి లాభాలే కాదు… స్టార్స్ నుంచి మంచి పొగడ్తలు కూడా వస్తూ ఉండడం విశేషం.
అయితే ఈ సినిమా విషయంలో ఎవరు ఎలా స్పందించారు అంటే…ఇప్పటివరకూ నాని వరుణ్ తేజ్ అను ఇమాన్యుయేల్ లు అర్జున్ రెడ్డిని పొగడగా ఇప్పుడు ఆ లిస్ట్ లో స్టార్ హీరోయిన్ అయిన సమంత కూడా చేరిపోయింది. “చాలా కాలం తర్వాత నేను చూసిన సినిమాల్లో సహజత్వానికి దగ్గరగా ఉన్న మూవీ అర్జున్ రెడ్డి. టాలీవుడ్ కి గోల్డెన్ డేస్ మనతోపాటే ఉన్నాయి. ‘అర్జున్ రెడ్డి’ టీం అద్భుతం” అంటూ ట్విట్ చేసింది సమంత. మొత్తంగా ఇలా ప్రతీ వైపు నుంచి పాసిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తూ ఉండడంతో అర్జున్ రెడ్డి అండ్ టీమ్ ఫుల్ హ్యాపీగా ఉందట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















