Samantha: ఎన్టీఆర్, పవన్, మహేష్ లకు సామ్ ఇచ్చిన ట్యాగ్స్ ఇవే.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ (Samantha) సమంతకు ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. సామ్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. (Prabhas) ప్రభాస్ మినహా టాలీవుడ్ టాప్ హీరోలందరితో కలిసి నటించి సమంత తన నటనతో మెప్పించారు. సమంత అంటే టాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం ప్రత్యేకమైన అభిమానం ఉంది. అయితే ఒక సందర్భంలో సమంత టాలీవుడ్ స్టార్ హీరోలకు ట్యాగ్స్ ఇచ్చారు. మహేష్ (Mahesh Babu) మోస్ట్ డిజైరబుల్ అని చెప్పిన సమంత జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) గ్రేట్ డ్యాన్సర్ అని అన్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురువుగారు అని ఆమె కామెంట్లు చేశారు.

పవన్ తో గురుశిష్యుల అనుబంధం ఉంటుందని ఆమె పేర్కొనగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. సమంత స్టార్ హీరోలతో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. సమంత సినిమాల్లో రీఎంట్రీపై దృష్టి పెట్టగా త్వరలో పూర్తిస్థాయిలో సినిమాలతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. సమంతకు నిర్మాతలు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.

సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో తెలియాల్సి ఉంది. ఈ వెబ్ సిరీస్ కోసం సామ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమంత సోషల్ మీడియా ప్రమోషన్స్ ద్వారా భారీ స్థాయిలో సంపాదిస్తున్నారని సమాచారం అందుతోంది. సమంత రీఎంట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఓటేస్తారో లేక కమర్షియల్ సినిమాలకు ఓటేస్తారో తెలియాల్సి ఉంది.

సమంత రీఎంట్రీలో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటించి మరిన్ని విజయాలను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సమంత మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకున్నారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తన హెల్త్ గురించి సమంత నుంచి అప్ డేట్ రావాల్సి ఉంది. సమంత కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus