Samantha: పండక్కి అల్లుడు ఇంటికొచ్చాడా? సమంత ఫొటోల్లో మరోసారి రాజ్‌ నిడిమోరు!

ప్రముఖ కథానాయిక సమంత, ప్రముఖ దర్శక నిర్మాత రాజ్‌ నిడిమోరు గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మీరు అనుకున్నది నిజమే అని చెబుతున్నట్లుగా.. ఈ ఇద్దరూ అప్పుడప్పుడు లీకులు ఇస్తున్నా.. ఎక్కడా అధికారికంగా చెప్పడం లేదు. సమంతనే ఎక్కువ లీకులు ఇస్తోంది అనేది నిజం. ఇప్పుడు మరోసారి ఆమె నుండే లీకులు, హింట్‌లు వచ్చాయి. కొత్త అల్లుడు పండక్కి ఇంటికి వచ్చినట్లు సమంత ఇంటికి రాజమ్‌ నిడిమోరు వచ్చారు. దీపావళి పండగను కూడా జరుపుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సమంతనే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

Samantha

దీంతో మరోసారి ఈ ఇద్దరి బంధం గురించి కామెంట్లు కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి కూడా. అలాగే ఇంకెన్నాళ్లీ హింట్‌లు.. కనీసం విజయ్‌ దేవరకొండ – రష్మిక మందనలా ఓ ఇన్‌డైరెక్ట్‌ క్లారిటీ ఇచ్చేయొచ్చు కదా అనే కామెంట్లు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత కొన్నేళ్లుగా సమంత – రాజ్‌ డేట్‌లకు వెళ్తున్నారో, సరదాగా తిరుగుతున్నారో తెలియదు కానీ తరచుగా బయట కనిపిస్తున్నారు. బాగా క్లోజ్‌ ఫ్రెండ్స్‌లా చెట్టాపట్టాలేసుకొని ఆ మధ్య కొన్ని ఫొటోలు కనిపించాయి. ఆ మధ్య రాజ్‌, సమంత ఒకే కారులో కనిపించారు.

రాజ్‌ – డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2’, ‘సిటడెల్‌: హనీ బన్నీ’ వెబ్‌ సిరీసుల్లో సమంత నటించింది. అలా రాజ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత స్నేహంగా కొనసాగిన ఈ బంధం ఇప్పుడు వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు తేలుతోంది. అయితే అంతా ఇలా ప్రచారం అయ్యాక తూచ్‌ మా మధ్య ఏమీ లేదు, మేం స్నేహితులం అని సమంత చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఇప్పుడు కొత్తల్లుడు తరహా ఫొటోలు చూస్తుంటే అలా అనరు అనిపిస్తోంది.

అయితే సమంత తన బంధం గురించి, బంధం బీటలు వారడం గురించి ఇలా సోషల్‌ మీడియాలో తొలుత లీకులు ఇచ్చి ఆ తర్వాత అఫీషియల్‌గా చెబుతూ ఉంటుంది. గతంలో నాగచైతన్యతో బంధం, విడాకులు గురించి అభిమానులుల, ప్రేక్షకులకు ఇలా లీకుల రూపంలోనే తెలిసింది. మరి రాజ్‌తో బంధం గురించి ఎలా చెబుతుందో చూడాలి.

రణ్‌వీర్‌ – దీపిక కూతురు ఫొటో అఫీషియల్‌ రిలీజ్‌.. సో క్యూట్‌ బేబీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus