టాలీవుడ్ లో లవ్ బర్డ్స్ గా మొదలయ్యి….పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవితాన్ని గడిపేస్తున్న జంటలు ఎన్నో ఉన్నాయి…అయితే అదే క్రమంలో అలాంటి జీవితాల్లో మన అక్కినేని నాగ్ సైతం ఒకడు…అమలను ప్రేమించి పెళ్ళడిన నాగ్ ఇప్పుడు టాలీవుడ్ కింగ్ గా చక్రం తిప్పడమే కాకుండా తన కుమారులతో సమానంగా నటిస్తూ దూసుకెళ్తున్నాడు…ఇదిలా ఉంటే…తాజాగా నాగ్ పెద్ద కుమారుడు నాగ చైతన్య – మరియు టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రేమలో పడటం పెద్దలు ఒప్పుకోవడం, పెళ్లి వరకూ పరిస్థితులు రావడం షరా మామూలుగా జరిగిపోయింది. అయితే ఈ ఏడాది అక్టోబరులో వీళ్ళిద్దరూ పెళ్లు చేసుకుని కొత్త జీవితాన్ని స్టార్ట్ చెయ్యనున్నారు. ఇదిలా ఉంటే మరో పక్క మీడియా చేస్తున్న హడావిడికి సమంత కాస్త కోపంగా జవాబు ఇస్తుంది….అసలు ఏం జరిగింది అని వివరాల్లోకి వెళితే… పెళ్లి చేసుకున్న తర్వాత సమంత సినిమాల్లో నటిస్తుందా? అనే ప్రశ్నను మీడియా ఎన్నో సార్లు అడగడం….ఆమె ఇప్పటికే ఎన్నోసార్లు దానికి సమాధానం చెప్పడం జరిగింది….అయితే అదే క్రమంలో పెళ్లయిన తరువాత కూడా నటిస్తూనే ఉంటానని క్లారిటీ కూడా ఇచ్చింది.
కానీ…మీడియా మాత్రం ఆమెను వదలడం లేదు…ప్రతిసారీ ఇదే ప్రశ్నను ఆమెకి అడుగుతూ ఉంది…ఇదిలా ఉంటే రీసెంట్గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంతకు మళ్లీ రిపోర్టర్ల నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో సమంతకు చిర్రెత్తుకొచ్చింది. ఇదే ప్రశ్నను ఏ డాక్టర్నో, ఇంజినీరునో, టీచర్నో వేస్తారా? వారు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అదే వృత్తిలో ఉంటారు కదా? అని సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లోనే కూర్చుని మగ్గిపొమ్మంటారా? అని ఘాటుగా ప్రశ్నించింది. మొత్తంగా ఆమె చెప్పిన ప్రకారం పెళ్లి అయిన తరువాత కూడా మనం మన జెస్సీ యాక్టింగ్ ను మిస్ అవ్వం అన్న మాట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.