మరోసారి ప్రయోగానికి సిద్ధమైన సమంత

  • October 17, 2018 / 06:39 AM IST

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ జాబితాలో సమంత, కాజల్ ముందు ఉంటారు. స్టార్ హీరో సినిమా అంటే వీరి పేర్లు తప్పకుండా దర్శకనిర్మాతలు పరిశీలిస్తారు. ఇప్పుడు కూడా అలాగే ఓ పౌరాణిక పాత్రకి కాజల్ ని అనుకుంటే ఆ రోల్ సమంత చేతికి వెళ్ళింది. అసలు వివరాల్లోకి వెళితే… యానిమేషన్ డైరెక్టర్ గా అవార్డులు గెలుచుకున్న భార్గవ్ తాజాగా రామాయణం ఆధారంగా ఓ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ చుట్టూ కథ నడుస్తుందని తెలిసింది. లీడ్ క్యారక్టర్ కాబట్టి ఈ పాత్రకి కాజల్ అగర్వాల్ ను తీసుకుందామని అనుకున్నారు. కానీ కాజల్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో సమంతని సంప్రదించారు.

రొటీన్ గ్లామర్ డాల్ రోల్స్ కాకుండా విభిన్నమైన రోల్స్ కోసం ఎదురుచూస్తున్న సమంతకి శూర్పణఖ కథ భలే నచ్చిందంట. అందుకే వెంటనే ఓకే చెప్పినట్టు తెలిసింది. సమంత రీసెంట్ గా “U టర్న్” లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసింది. జర్నలిస్ట్ పాత్రను అద్భుతంగా పోషించి అందరితో అభినందనలు అందుకుంది. ఇప్పుడు రావణాసురుడి చెల్లిగా చక్కగా నటిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus