కొత్త సినిమాలపై సమంత క్లారిటీ

దక్షిణాది చిత్ర పరిశ్రమలో సక్సస్ రేటు అధికంగా ఉన్న నటి సమంత. ఈ ఏడాది ఆమె నటించిన తేరి, 24, అ..ఆ, జనతా గ్యారేజ్ లు విజయాన్ని సాధించాయి. అయినా ఆమె చేతిలో ప్రస్తుతం ఒక సినిమా కూడా లేదు. నెల రోజుల క్రితం శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కనున్న తమిళ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పింది. ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్లేలా కనిపించడం లేదు. నాలుగు నెలల క్రితం ఒప్పుకున్న “వడ చైన్నై” మూవీ నుంచి కూడా సమంత బయటికి వచ్చేసింది. దీనికంతటికి కారణం పెళ్లి అని, అక్కినేని ఇంటి కోడలుగా అడుగు పెట్టడం ఖాయం కావడంతో సినిమాలు ఒప్పుకోవడం లేదని సినీ పరిశ్రమలో ప్రచారం మొదలైంది.

ఈ వార్తలు సమంత వద్దకు కూడా చేరింది. దీంతో ఆమె ఈ రోజు స్పందించింది. పెళ్లి గురించి ప్రస్తావన తీసుకు రాకుండా సినిమాలు సైన్ చేయక పోవడానికి వెనుక కారణాన్ని వెల్లడించింది. “ఈ విషయం చెప్పడం నాకెంతో బాధగా ఉంది. దక్షిణాది సినిమాల్లో హీరోయిన్లకు అర్ధవంతమైన పాత్రలు దొరకడం ఎంత కష్టమో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. మంచి క్యారెక్టర్స్ రాకపోవడంతోనే నేను ఇంతవరకు కొత్త సినిమాకు సైన్ చేయలేదు” అని ట్వీట్ చేసింది. శ్యామ్ ముద్దు మాటలు చూస్తుంటే “ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్‌, నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాఁడు ధన్యుడు సుమతీ!” అనే సుమతి శతకము గుర్తుకొస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus