నటి సమంత ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతోను అలాగే శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలోను బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత కేవలం సినిమాల గురించి మాత్రమే కాకుండా తన వ్యక్తిగత జీవితం గురించి కూడా పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా సమంత తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా గత రెండు సంవత్సరాలుగా ఆమె తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి కూడా ప్రస్తావించారు.గత రెండు సంవత్సరాల క్రితం నటుడు నాగచైతన్య సమంతకు విడాకులు ఇవ్వడం ద్వారా ఆమె పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లి ఒంటరిగా గడపడం అనంతరం ఈ విడాకుల విషయం నుంచి కోలుకొని సినిమాలతో బిజీ కాగా తనకు మయో సైటిసిస్ వ్యాధి వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా సమంత వ్యక్తిగత జీవితంలో గత రెండు సంవత్సరాలుగా చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొన్నానని తెలియజేశారు.
అయితే ఈ ఇబ్బందుల నుంచి తనని తన పనే తిరిగి నిలబడేలా చేసిందని తెలిపారు. ఇప్పటికీ తనకు నిలకడగా ఉండే శక్తిని ప్రసాదించిందని సమంత వెల్లడించారు. నేను సాధారణంగా దేని కారణంగా నా పనిని ప్రభావితం చేయను. నేను మంచం మీద నుంచి లేవ లేకపోతే తప్ప.. కానీ గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఈమె వెల్లడించారు.
తాను (Samantha) ఇలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు ఒకవైపు ప్రొడక్షన్ వారు మరొకవైపు అభిమానులు ఇచ్చిన మద్దతు, ప్రోత్సాహం తనకు ఎంతో బలాన్ని కలిగించిందని, ఆ ప్రోత్సాహమే తిరిగి నన్ను కోలుకునేలా చేసే సినిమా షూటింగులలో పాల్గొనేలా చేసింది అంటూ ఈ సందర్భంగా సమంత తెలియజేశారు. ఇలా శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత తన వ్యక్తిగత జీవితం గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.