Samantha: ముంబై ఎయిర్‌పోర్టులో సమంత.. వైరల్ అవుతున్న పిక్స్, వీడియో..

సౌత్ క్వీన్ సమంత చాలా రోజుల తర్వాత బయట ప్రపంచంలోకి అడుగు పెట్టింది.. తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో ఆమె కెమెరాల కంట పడింది.. సామ్ తనకు సోకిన మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి గురించి బయట పెట్టినప్పటినుండి వార్తల్లో నిలుస్తూ వస్తోంది.. ‘యశోద’ ప్రమోషన్స్ తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ ఇంటికే పరిమితమైపోయింది..ఇంట్లో నుండే ‘శాకుంతలం’ మూవీ డబ్బింగ్ స్టార్ట్ చేసింది.. తన పాత్రకు డబ్బింగ్ చెప్తున్న స్క్రీన్ ఇమేజ్ షేర్ చేస్తూ.. ఎమోషనల్ పోస్ట్ చేసింది..

‘‘బాధకైనా, ముఖ్యమైనవి కోల్పోయినపుడైనా, ఒంటరిగా వున్నా, ఇలాంటి పరిస్థితులల్లో ఆర్ట్ క్యూర్ లాంటిది’ అంటూ నిక్కి రోవ్ లైన్స్ యాడ్ చేసింది సామ్.. ఇక ముంబై ఎయిర్‌పోర్టులో వైట్ స్లీవ్ లెస్ షర్ట్, ప్యాంట్ ధరించి.. సన్ గ్లాసెస్‌తో నడుచుకుంటూ వెళ్తున్న సామ్ పిక్స్, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇంతకుముందు కంటే కాస్త నీరసంగా కనిపించింది సామ్.. ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ డిస్కషన్ గురించి ఆమె ముంబై వెళ్లినట్టు సమచారం..

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus