అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఫిట్నెస్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమయం దొరికినప్పుడల్లా జిమ్లో వర్కౌట్లు చేస్తూనే ఉంటుంది. అదే విధంగా ప్రాణాయామం,యోగాసనాలు చేస్తున్న వీడియోలను కూడా ఇది వరకు తన సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది. ఆమె డెడికేషన్ కు అందరూ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల మరో వీడియోను కూడా పోస్ట్ చేసి ఔరా అనిపించింది సమంత.
ఈ వీడియోలో ఆమె గోసరాగా శీర్షాసనం ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో షూటింగ్లు క్యాన్సిల్ అవ్వడం.. దాంతో ఇంట్లోనే ఉండిపోవడంతో ఆమె ఈ ఖాళీ సమయాన్ని తన ఫిట్నెస్ కాపాడుకోవడం పై దృష్టి పెట్టినట్టు స్పష్టమవుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గుణశేఖర్ డైరెక్షన్లో ‘శాకుంతలం’ అనే చారిత్రాత్మక చిత్రం చెయ్యడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
గుణశేఖర్ అండ్ టీంతో కలిసి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా ఉధృతి తగ్గిన తరువాత ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.అలాగే నయనతార తో కూడా కలిసి సమంత ఓ సినిమాలో నటిస్తుంది. దీంతో పాటు ‘ది ఫ్యామిలీ మెన్2’ వెబ్ సిరీస్ తో కూడా ప్రేక్షకులను పలకరించడానికి సమంత రెడీ అయ్యింది. ఇందులో ఆమె నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రను పోషించినట్లు సమాచారం.