టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన వృత్తిపరమైన జీవితానికి కాస్త విరామం ప్రకటించి వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. గతంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే అప్పటినుంచి ఈ వ్యాధి ఎన్నో రకాల ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ వ్యాధి నుంచి బయటపడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి సమంత సినిమాలకు కూడా విరామం ప్రకటించారు. ఇలా సినిమాలకు దూరంగా ఉంటున్నటువంటి సమంత ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఈ వ్యాధి నుంచి బయట పడాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
అలాగే ఎన్నో వెకేషన్స్ కి వెళ్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈమె తన వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారని చెప్పాలి. గత కొద్ది రోజుల క్రితం వరకు క్రయోథేరఫీ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి సమంత తాజాగా ఆయుర్వేద ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె భూటాన్ వెళ్లి అక్కడ ఈ చికిత్స కోసం ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఈ ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి విషయాలను అలాగే ఫోటోలను కూడా షేర్ చేశారు.
ఈ ఆయుర్వేద ట్రీట్మెంట్ లో భాగంగా హార్ట్ స్టోన్ బాత్ అనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సమంత తెలియజేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఇలా వీటితోపాటు అక్కడ చేనేత పరిశ్రమకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు వీడియోలను కూడా ఈమె అభిమానులతో పంచుకున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవడంతో ఎంతోమంది ఈ ఫోటోలు చూసి (Samantha) సమంత మయోసైటిసిస్ నుంచి బయటపడటం కోసం ఎంతో కష్టపడుతున్నారని, త్వరలోనే సమంత ఈ వ్యాధి నుంచి బయటపడి పూర్తిగా కోలుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!