చైతూ కామెంట్ పై సమంత కౌంటర్

పెళ్లి చేసుకోబోయే ముందు వరుడు బ్యాచిలర్ పార్టీ ఇవ్వడమనేది ఇప్పుడు మన సంప్రదాయంలో భాగమయి పోయింది. అందుకే సుశాంత్ బ్యాచిలర్ పార్టీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఏంటి ? అతను పెళ్లి చేసుకోబోతున్నాడా? కాదు కాదు.. అటువంటి కథతో “చి.ల.సౌ” సినిమా చేశారు. ఇందులో పెళ్లి కూతురిగా రుహానీ శర్మ నటిస్తోంది. రాహుల్ రవీంద్రన్ (అందాల రాక్షసి హీరో) తొలి సారి మెగా ఫోన్ పట్టి తెరకెక్కించిన ఈ సినిమా త్వరలో థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా సుశాంత్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, “హలో బాయ్స్ అండ్ గాల్స్… నా బ్యాచ్ లర్ పార్టీకి మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాను. కింద ఉన్న గూగుల్ లింక్ తెరచి, పెళ్లిని వాయిదా వేసుకునేందుకు మీరు ఏ కారణం చెబుతారో తెలియజేయండి.

గెలుపొందినవారికి రిలీజ్ కు ముందే సినిమాను చూపించి, అద్భుతమైన పార్టీ ఇస్తాను” అని చెప్పాడు. దీనిపై నాగచైతన్య స్పందిస్తూ.. “దట్స్ క్రేజీ మ్యాన్. కేవలం బ్యాచిలర్స్ నే పిలుస్తారా? నన్ను మరచిపోయినట్టున్నావు. నాలోని బ్రహ్మచారి ఇంకా బతికే ఉన్నాడు” అని పోస్టు చేశారు. ఇంకేముంది సమంత ఎంట్రీ ఇచ్చింది. “భర్తగారూ… మీరు చెప్పింది నిజమే” అని చైతూకి సున్నితంగా చురకలు అంటించింది. వీరి ట్వీట్స్ ని అభిమానులు చదువుకొని సరదాగా నవ్వుకుంటున్నారు. పెళ్లి తర్వాత సమంత, నాగ చైతన్య కలిసి నటిస్తున్న మూవీ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus