టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత సినిమాల్లో మాదిరిగానే బయట కూడా అల్లరి ఎక్కువగా చేస్తుంటారు. ఎప్పుడూ సరదగా కనిపించే ఆమెపై చిన్న విమర్శ కూడా ఉంది. కోపం ముక్కుమీద ఉంటుందని కొంతమంది చెబుతుంటారు. అది నిజమేనా? అని సమంతని అడగగా.. అందుకు ఆమె ఒప్పుకున్నారు. “ఇది వరకు నాకు షార్ట్ టెంపర్ ఉండేది. ఈ మధ్యకాలంలో నేను చాలా మారిపోయాను. నా షార్ట్ టెంపర్ మొత్తాన్ని చైతూ తగ్గించేశాడు.” అని వెల్లడించారు. చైతూని పెళ్లి చేసుకున్న తర్వాత సమంత కొత్త ఎనర్జీతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది రంగస్థలం, మహానటి, యూ టర్న్.. ఇలా వరుసగా విజయాలను అందుకున్నారు.
ఈ సందర్భంగా ఛానల్ ల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తమ ఇంట్లో జరిగే సంగతులు బయటపెట్టారు. “నిజం చెబుతున్నాను … ఇంట్లో అప్పర్ హ్యాండ్ ఆయనదే. బయట జనాలకి కనిపించేలా చైతూ ఇంట్లో ఉండదు. ఇంట్లో పరిస్థితి రివర్స్ ఉంటుంది. బయట నేను ఎక్కువగా మాట్లాడేస్తూ .. అల్లరి చేస్తూ కనిపిస్తాను గానీ, ఇంట్లో మాత్రం సైలెంటే. ఆయన చాలా క్యూట్ గా ఉంటాడు కనుక, ఇంట్లో ఆయనను నేను ‘బేబీ’ అని పిలుస్తూ ఉంటాను” అంటూ సమంత చెప్పారు. త్వరలో వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. పెళ్లి తర్వాత చేస్తున్న సినిమా కావడంతో దానిపై సహజంగానే క్రేజ్ నెలకొంది.