డిసెంబర్ లో సమంత పెళ్ళి ఫిక్స్!
- July 5, 2016 / 06:43 AM ISTByFilmy Focus
సమంత-నాగచైతన్యల పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని వాళ్ళు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకంటే సినిమా అభిమానులే ఎక్కువగా ఆలోచించేస్తున్నారు. నాగార్జున కూడా ఒప్పేసుకోవడంతో.. ఇక వీరి పెళ్లి అతి త్వరలోనే అని అందరూ ఫిక్స్ అయిపోయారు. వారికి మరింత ఆనందాన్ని పంచుతూ.. డిసెంబర్ లో పెళ్ళి చేసేయాలని ఇరు కుటుంబాల సభ్యులు తీర్మానించారని వినికిడి.
చైతూ ప్రస్తుతం “ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో” సినిమా హడావడిలో ఉన్నాడు. సెప్టెంబర్ కల్లా రెండు సినిమాలూ విడుదలైపోతాయి, తర్వాత చైతూ ఫ్రీ అయిపోతాడు. సమంత ఇప్పటికే ఒప్పుకొన్న సినిమాల నుంచి తప్పుకొంటూ తన డేట్స్ ను కుటుంబానికి కేటాయిస్తోంది. సో, ఇద్దరూ డిసంబర్ లో ఒక్కటవనున్నారు. మరి పెళ్లయ్యాక సమంత నటిస్తుందో లేక అమల వలె సినిమాలకు స్వస్తి పలుకుతుందో చూడాలి!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













