టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి సమంత చివరిగా ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత సినిమాలకు కమిట్ అవకుండా పూర్తిగా తన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇలా ఏడాది పాటు సమంత సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొనే ఎలాంటి సినిమాలకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి సమంత తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. పలు విదేశీ పర్యటనలకు వెళ్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈమె ఎంజాయ్ చేయడమే కాకుండా సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను అభిమానులతో పంచుకుంటూ అభిమానులను కూడా సందడి చేస్తున్నారు. ఇలా సమంత ఒకవైపు సినిమాలలో కొనసాగుతూనే మరోవైపు వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈమె సాకి అనే బ్రాండెడ్ దుస్తుల వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు ఇలా తన వ్యాపారాన్ని సమంతనే ప్రమోట్ చేస్తూ బిజినెస్ రంగంలో కూడా ఎంతో మంచి సక్సెస్ సాధించారు. ఇలా సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తన బిజినెస్ ప్రమోషన్లలో మాత్రం అసలు తగ్గడం లేదని చెప్పాలి తరచూ సాకీ బ్రాండ్ కి సంబంధించినటువంటి వివిధ రకాల డిజైనర్ వేర్ ధరించి పెద్ద ఎత్తున ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె ఆ ఫోటోలను షేర్ చేస్తూ భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా సమంత (Samantha) అద్భుతమైన డిజైనర్ సారీస్ ధరించి గ్లామరస్ ఫోటో షూట్ చేశారు. అయితే ఇవి కూడా సాకీ బ్రాండ్ కు సంబంధించినవి కావటం విశేషం. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ వ్యాపార రంగంలో మాత్రం సమంత చాలా చురుగ్గా ఉన్నారని ఇలా సోషల్ మీడియా వేదికగా తన బిజినెస్ భారీ స్థాయిలో ప్రమోట్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. సమంత వచ్చే ఏడాది తర్వాతనే కొత్త సినిమాలకు కమిట్ అవ్వబోతున్నారని అప్పటివరకు ఈమె ఎలాంటి సినిమా కథలను కూడా వినడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ; View this post on Instagram ; A post shared by Saaki (@saaki.world) ; View this post on Instagram ; A post shared by Saaki (@saaki.world) ; View this post on Instagram ; A post shared by Samantha (@samantharuthprabhuoffl) ; View this post on Instagram ; A post shared by Saaki (@saaki.world) ; View this post on Instagram ; A post shared by Samantha (@samantharuthprabhuoffl) ; View this post on Instagram ; A post shared by Samantha (@samantharuthprabhuoffl) https://youtu.be/TlCiYQviSXQ ; ‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..! ‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..! ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!