Samantha: బికినీ ఫోటోలు షేర్ చేసి మరీ ఎమోషనల్ కామెంట్స్ చేసిన సమంత.. ఫోటోలు వైరల్!

Advertisement

సమంత బజార్ మీడియా అనే మ్యాగజైన్‌ కోసం ఓ ఘాటైన ఫోటో షూట్ చేసింది. తాజాగా ఈ ఫోటోలు షేర్ చేసి అందరికీ షాకిచ్చింది సామ్. ఆ ఫోటోల్లో ఆమె బ్లాక్ బికినీలో ఘాటైన అందాలతో దడ పుట్టించింది. అదే టైంలో కొన్ని ఎమోషనల్ కామెంట్స్ కూడా చేసింది. వాటిని గమనిస్తే.. “ఒకేసారి నా జీవితంలో బాధలన్నీ వచ్చాయి. నా వైవాహిక జీవితం ఫెయిల్ అయ్యింది.. నా హెల్త్ అప్సెట్ అయ్యింది. దీంతో నా సినీ కెరీర్ కూడా డిస్టర్బ్ అయ్యింది. అవే నా జీవితంలో బాధాకరమైన ఘటనలు.

గత రెండేళ్లుగా నాపై అవి ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయి. అలాంటి సమయంలో కొంతమంది నటీనటులు కథలు చదివాను.. నాలానే ఎవరైనా వ్యాధితో పోరాడి గెలిచినా వాళ్ళు ఉన్నారా?’ అనే ఉద్దేశంతో..! అలాంటి వాళ్ళు ఉన్నారు. వారి కథలు తెలిసాక నాలో ధైర్యం పెరిగింది. వారంతా సాధించినప్పుడు నేను ఎందుకు సాధించలేను? అనే ప్రశ్న కూడా నాలో మెదిలింది. మన కోసం నిలబడే వారు, మన పై ప్రేమను చూపించే వారు.. నటిగా మన ఎదుగుదలకు కారణమయ్యేవారు మనకి దొరకడం మన అదృష్టంగా భావించాలి.

అలాంటి గొప్ప స్థాయి మనకు ప్రేక్షకులు ఇచ్చినప్పుడు ఎంతో బాధ్యతతో మెలగాలి.. మన జీవితంలో జరిగిన విషయాలను ఎంతో నిజాయితీగా, వాస్తవాలను చెబుతూ ఇతరుల్లో స్పూర్తిని నింపాలి. ఎన్ని సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు వచ్చాయని చెప్పడం కాదు.. ఎన్ని అవార్డులు వచ్చాయో చెప్పడం కాదు.. మన బాడీ ఎలా ఉందో చూపించడం కాదు.. ఎలాంటి అవుట్ ఫిట్స్ వేసుకున్నామో చూపించడం కాదు.. మనం పడే బాధను.. ఎదుర్కొనే కష్టాలను చెప్పాలి..

నా విషయాలన్ని బయటకు వచ్చాయని నేను పట్టించుకోను.. బాధపడను.. నేను ఎప్పటికైనా వాటితో పోరాడాల్సిందే అని నాకు తెలుసు.. ఇవన్నీ నేను బయటకు చెప్పడం వల్ల నాలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి ధైర్యం, శక్తి వస్తుందని నా అభిప్రాయం” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం (Samantha) సమంత బికినీ ఫోటోలు, ఎమోషనల్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus