యువ సామ్రాట్ నాగచైతన్యతో సమంతకు ఈనెల ఆరవ తేదీన ఘనంగా పెళ్లి జరిగింది. కళ్యాణం తర్వాత కొత్త జంట హనీమూన్ అంటూ నెలరోజుల పాటు రెస్ట్ తీసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ సమంత మాత్రం అలా చేయలేదు. గురువారమే మీడియా ముందుకు వచ్చింది. తాను నటించిన రాజుగారి గది 2 ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంది. అంతేకాదు నేటి నుంచి షూటింగ్ లో పాల్గొననుంది. మహానటి సావిత్రి బయో పిక్ లో సమంత కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
నాగ్ అశ్విన్ డైరక్క్షన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇంకా ప్రొడక్షన్ దశలోనే ఉంది. అందుకే ఆ చిత్రాన్ని కంప్లీట్ చేయాలనీ సెట్స్ కి సమంత వెళ్ళింది. తనని నమ్ముకున్న నిర్మాతలను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అంతేకాదు “రంగస్థలం 1985 ” చిత్రంలో మిగిలి ఉన్న తన సన్నివేశాలను కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం. సమంత కమిటిమెంట్ చూసి టాలీవుడ్ వర్గాలు ఆమెను అభినందించక ఉండలేకపోతున్నారు.