Samantha: సమంతకు ‘కరెక్ట్’ కాదట.. రష్మికకు ‘స్పెషల్’ అట! అసలు కథేంటి?

రష్మిక మందన్నా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాపై మంచి బజ్ నడుస్తోంది. నవంబర్ 7న రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. అయితే, ఈ సినిమా రిలీజ్ టైమ్‌లో, దీని క్యాస్టింగ్ వెనుక జరిగిన అసలు కథ ఇప్పుడు బయటపడింది. ఈ ప్రాజెక్ట్‌కు రష్మిక మొదటి ఛాయిస్ కాదనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Samantha

దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్వయంగా ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చాడు. ఈ కథను ముందుగా సమంతకే చెప్పిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే, కథ మొత్తం చదివిన తర్వాత, ఈ పాత్రకు తాను “కరెక్ట్ కాదేమో” అని సామ్ జెన్యూన్‌గా ఫీల్ అయ్యారట. వేరే హీరోయిన్ చేస్తే బాగుంటుందని ఆమె సూచించినట్లు రాహుల్ వెల్లడించారు.

సమంత లాంటి స్టార్ ఒక కథను “నేను సెట్ కాను” అని చెప్పడం వెనుక బలమైన కారణమే ఉండొచ్చు. ప్రస్తుతం సామ్ తన ఇమేజ్‌ను మార్చుకునే పనిలో ఉన్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘సిటాడెల్’ వంటి యాక్షన్ ప్రాజెక్టులు, లేదా బలమైన మెచ్యూర్డ్ రోల్స్ వైపు ఆమె మొగ్గు చూపుతున్నారు. బహుశా, ఈ ‘గర్ల్‌ఫ్రెండ్’ స్టోరీ తన ప్రస్తుత ఇమేజ్‌కు తగినది కాదని ఆమె భావించి ఉండవచ్చు.

సమంత ఏదైతే తనకు ‘కరెక్ట్ కాదు’ అని వదిలేసిందో, అదే రష్మికకు ‘స్పెషల్’గా కనెక్ట్ అయింది. ‘యానిమల్’ లాంటి రా, మాస్ హిట్ తర్వాత, రష్మికకు తనను తాను నటిగా నిరూపించుకోవడానికి ఇలాంటి రియలిస్టిక్ పాత్ర చాలా అవసరం. అందుకే కథ విన్న రెండు రోజులకే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, “నన్ను నిజమైన వ్యక్తిగా చూపించండి” అని రాహుల్‌ను కోరినట్లు తెలుస్తోంది.

మొత్తానికి, సమంత వదులుకున్న ఈ ఆఫర్, రష్మికకు సరైన సమయంలో దక్కింది. ‘యానిమల్గెటప్ నుంచి బయటపడి, నటిగా తనలోని మరో కోణాన్ని చూపించడానికిది గర్ల్‌ఫ్రెండ్రష్మికకు బాగా ప్లస్ అయ్యేలా ఉంది. అమ్మాయిలకు బలంగా కనెక్ట్ అవుతుందని రష్మిక నమ్మిన ఈ కథ, ఆమె కెరీర్‌లో మరో గుర్తుండిపోయే సినిమా అవుతుందేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus