Samantha: సామ్ తొలి జాబ్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

స్టార్ హీరోయిన్ సమంతకు ఇప్పటికీ ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గలేదనే సంగతి తెలిసిందే. సమంత ప్రస్తుతం ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే సామ్ తన రెమ్యునరేషన్ ను మరింత పెంచే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. అయితే సమంత ఎన్నో కష్టాలను అనుభవించి ఈ స్థాయికి వచ్చారు. సమంత తాజాగా నెటిజన్లతో ముచ్చటించగా ఆమెకు తొలి సంపాదనకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

Click Here To Watch NOW

ఆ ప్రశ్నకు సమంత సమాధానం ఇస్తూ తన తొలి సంపాదన కేవలం 5000 రూపాయలు అని చెప్పుకొచ్చారు. ఒక హోటల్ లో తాను హోస్టెస్ గా పని చేశానని ఆ సమయంలో తనకు ఈ మొత్తం సంపాదనగా వచ్చిందని ఆమె కామెంట్లు చేశారు. పదో తరగతిలోనో పదకొండో తరగతిలోనో ఈ మొత్తం సంపాదించానని ఆమె వెల్లడించారు. సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సమంత ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకోవడానికి అభిమానులతో చిట్ చాట్ నిర్వహించడంతో పాటు అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమధానాలను ఇచ్చారు.

సమంత కెరీర్ విషయంలో మరింత ఎదగాలని బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా ఆమె సత్తా చాటాలని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు సమంత శాకుంతలం సినిమాకు సంబంధించి ఇప్పటికే డబ్బింగ్ పనులను పూర్తి చేశారు. సమంత నటించిన యశోద సినిమా కూడా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న సమంత ఈ రెండు సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.

బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్ లపై కూడా దృష్టి పెట్టిన సమంత సినిమాల విషయంలో తెలివిగా అడుగులు వేస్తున్నారు. సమంత కథల ఎంపిక విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కథ నచ్చితే మాత్రమే సమంత కొత్త ప్రాజెక్ట్ లకు ఓకే చెబుతున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus