హనీమూన్ గురించి షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన సమంత
- June 15, 2017 / 10:39 AM ISTByFilmy Focus
సమంత, నాగచైతన్యల ప్రేమను పెద్దలు అంగీకరించి జనవరి 29న నిశ్చితార్థం జరిపించారు. పెళ్లిని కూడా ఫిక్స్ చేశారు. అక్టోబర్ ఆరవ తేదీన తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు నాగచైతన్య రీసెంట్ గా వెల్లడించారు. పెళ్లి ముహూర్తంలోపున తమ ప్రాజక్టులను పూర్తి చేసే పనిలో చైతూ, సమంత ఉన్నారు. ప్రస్తుతం నాగ చైతన్య తన కొత్త చిత్రం షూటింగ్ కోసం అరకులో ఉన్నారు. సమంత మాత్రం ఈరోజు హైదరాబాద్ లోని నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లోగల ఓ బ్యూటీక్లీనిక్ ప్రారంభోత్సవానికి హాజరైంది. ఈ సందర్భంగా పెళ్లి గురించి ఆమెను అడగగా ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
అక్కినేని ఇంట కోడలిగా అడుగు పెట్టబోతున్నందుకు ఆనందంగా ఉందని వెల్లడించింది. మరి హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేసారని ప్రశ్నించగా.. అసలు హనీమూన్ కి వెళ్లడం లేదని చెప్పి షాక్ ఇచ్చింది. వృత్తిపరమైన కమిట్మెంట్ వల్ల హనీమూన్ కి వెళ్లడం లేదా? లేకుంటే పెళ్లి పనులు, షూటింగ్ పనుల వల్ల ఇంకా ప్లాన్ చేయలేదా? అనేది నాగ చైతన్య క్లారిటీ ఇవ్వాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















