‘శాకుంతలం’ చూసి సమంత చెప్పిన రివ్యూ ఏంటంటే..?

  • March 14, 2023 / 09:49 PM IST

స్టార్ హీరోయిన్ సమంత కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత తిరిగి పనిలో బిజీ అయిపోయింది.. మయోసైటిస్ కారణంగా షూటింగులకు బ్రేక్ ఇచ్చి ఇంట్లోనే ‘శాకుంతలం’ డబ్బింగ్ కంప్లీట్ చేసింది.. ఫిబ్రవరి 17న రావాల్సిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వల్ల డిలే అయింది.. బాలీవుడ్ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కోసం బాంబే వెళ్లింది.. ఇటీవలే విజయ్ దేవరకొండ పక్కన చేస్తున్న ‘ఖుషి’ బ్యాలెన్స్ షూటింగ్‌లో పాల్గటుంది.. ఇదిలా ఉంటే రీసెంట్‌గా సామ్ ‘శాకుంతలం’ సినిమా చూసింది.. ఫస్ట్ కాపీ రెడీ అవగానే నిర్మాత దిల్ రాజు, గుణ శేఖర్ ఆమెకు ప్రివ్యూ వేశారు..

సామ్ ప్రధానపాత్రలో నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘శాకుంతలం’.. భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టింది పేరైన గుణ శేఖర్ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.. గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ల మీద నీలిమ గుణ నిర్మిస్తున్నారు. మలయాళీ యాక్టర్ దేవ్ మోహన్, డా.మోహన్ బాబు, సచిన్ కేడ్‌కర్, గౌతమి, మధుబాల, ప్రకాష్ రాజ్, కబీర్ బేడి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, వర్షిణి సౌందరరాజన్ వంటి భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో నిర్మించారు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె చిన్నారి అల్లు అర్హ ఈ సినిమాతో బాలనటిగా పరిచయమవుతోంది.. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో ఏప్రిల్ 14న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్, సాంగ్స్ సినిమా మీద అంచనాలు పెంచాయి. సమంత కెరీర్‌లో సోలోగా మరో సూపర్ హిట్ అందుకోనుందనిపించేలా ‘శాకుంతలం’ ట్రైలర్ ఉందంటున్నారు సామ్ ఫ్యాన్స్..

ఇక సినిమా చూసిన తర్వాత తన ఆనందాన్ని షేర్ చేసుకుంది.. ఫైనల్ గా సినిమా చూశానని.. ‘‘గుణ శేఖర్ మీరు నా హార్ట్.. సినిమా చాలా అద్భుతంగా ఉంది.. మన గొప్ప ఇతిహాసానికి చాలా మనోహరంగా జీవం పోసారు.. ప్రేక్షకులు సినిమాలోని భావోద్వేగాలకు కనెక్ట్ అవుతారు’’.. అంటూ ‘శాకుంతలం’ కచ్చితంగా ఆడియన్స్‌ని అలరిస్తుందంటూ టీమ్‌తో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసింది..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus