మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో ఓ పల్లెటూరి ప్రేమకథని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కేరళలోని అందమైన ప్రాంతంలో జరుగుతోంది. మొదటి షెడ్యూల్ ల్లో చెర్రీ, సమంతలపై పాటని చిత్రీకరిస్తున్నారు. రేపల్లె అనే టైటిల్ పరిశీలిస్తున్న ఈ మూవీ గురించి ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. ఇందులో సమంత మూగదానిగా నటిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఇందులో చరణ్ చెవిటోడిగా నటిస్తున్నారని వార్తలు వస్తుంటే.. ఇప్పుడు సమంత పాత్ర తెలిసి అందరూ షాక్ తింటున్నారు.
1980 సంవత్సరంలో అందమైన గ్రామంలో జరిగిన ప్రేమ కథని ఇలాంటి పాత్రలతో సుకుమార్ సినిమాగా మలచడం పెద్ద ప్రయోగమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక ఆర్ట్ ఫిల్మ్ కథకు కమర్షియల్ హంగులు ఎలా జోడిస్తారోనని చర్చించుకుంటున్నారు. నాన్నకు ప్రేమతో తర్వాత సుకుమార్ , ధృవ సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు కెమెరా మెన్ గా వ్యవహరిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.