అక్కినేని సమంత పెళ్లి తరువాత కొంచం కథల విషయంలో మార్పు వచ్చిందంటున్నారు. ఇటీవలే ఆమె ‘యూటర్న్’ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించినంతగా ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే కన్నడ లో సూపర్ హిట్ అయిన ‘యూటర్న్’ సినిమాని అదే పేరుతో తెలుగు, తమిళంలో రీమేక్ చేసారు. సమంత నటించిన మొదటి రీమేక్ సినిమా కూడా ఇదే. ఇక తాను చేయబోయే నెక్స్ట్ సినిమా కూడా ఒక రీమేక్ ఏ అంటూ వార్తలు వస్తుండగా సమంత ఈ సినిమా పైన చాలా ఆశలు పెట్టుకుందని తెలుస్తుంది.
అయితే నందిని రెడ్డి దర్శకత్వంలో, నాగ శౌర్య, సమంత జంటగా సురేష్ ప్రొడక్షన్స్ లో ఒక సినిమా రానుంది. ఈ సినిమా ఒక కొరియన్ సినిమాకి రీమేక్ అని తెలుస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్ వారు ‘మిస్ గ్రానీ’ సినిమా రైట్స్ తీసుకొని అఫీషియల్ గా ఈ సినిమాని తీస్తున్నారట. ఇక నాయనమ్మ – మనువరాలి పాత్రల్లో నడిచే ఈ సినిమాలో సమంత మనువరాలి పాత్రలో నటించనుంది. మరి రీమేక్ అంతగా కలసి రాని సమంతకి, ఇప్పటికి సరైన సక్సెస్ లేని డైరెక్టర్ నందిని రెడ్డి కి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వెయిట్ చేయాల్సిందే.