టాలీవుడ్ క్యూట్ నటి సమంత తన ప్రియుడు నాగ చైతన్య గురించి తొలిసారి నోరు విప్పింది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో పొట్టి మాటలతో ఊరించిన ఈ ముద్దుగుమ్మ తాను ప్రేమలో ఉన్నట్లు బహిరంగంగా ఒప్పుకుంది. నేడు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మొత్తం స్టోరీ ని వివరించింది. “ఏ మాయ చేసావే సినిమాలో నటిస్తున్నప్పుడే మా మధ్య ప్రేమ చిగురించింది. ఆ సమయంలో మేము దానిని సీరియస్ గా తీసుకోలేదు. రాను రాను మా బంధం బలపడింది.
మూడు నెలలక్రితం పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొని మా పేరెంట్స్ కి చెప్పాము. వారు సరేనన్నారు” అని సమంత చెప్పింది. అయితే ఈ సంవత్సరం పెళ్లి ఉండదని స్పష్టం చేసింది. నాగ చైతన్యలో మీకు నచ్చింది ఏమిటని ప్రశ్నిస్తే.. అందుకు సమాధానంగా “నా ఆలోచనలు గజి బిజీ గా సాగుతుంటాయి. కచ్చితమైన నిర్ణయం తీసుకోవడానికి చాలా టైమ్ తీసుకుంటాను. ఈ విషయంలో “చై(నాగ చైతన్య)” పూర్తి ఆపోజిట్. చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. తన ఆలోచనలో స్పష్టత ఉంటుంది. అతనిలో నాకు అదే బాగా నచ్చింది” అని క్రేజీ నటి తెలిపింది.