Samantha: విడాకులపై మళ్లీ నోరు విప్పిన సామ్.. ఏమన్నారంటే?

  • March 29, 2023 / 06:36 PM IST

స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్యతో విడాకుల ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. సమంత చైతన్యతో ఎందుకు విడిపోయారనే ప్రశ్నకు చైతన్య, సమంతకు మినహా దాదాపుగా ఎవరికీ సమాధానం తెలియదు. ఈ విడాకులకు సంబంధించి కొంతమంది సమంతను నిందిస్తే మరి కొందరు నాగచైతన్యను నిందించారు. సమంత, చైతన్య రెండో పెళ్లికి సంబంధించి ఎన్నో వార్తలు వినిపించినా ఆ వార్తలు నిజం కాలేదు. అయితే సమంత తాజాగా మరోమారు విడాకుల గురించి షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.

విడాకులు తీసుకున్న తర్వాత పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ఆఫర్ రాగా ఆ ఆఫర్ కు వెంటనే ఓకే చెప్పానని సమంత వెల్లడించారు. నేను ఏ తప్పు చేయలేదని తప్పు చేయని నేను బాధ పడుతూ ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం ఏముందని అనిపించిందని సమంత చెప్పుకొచ్చారు. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తున్నట్టు ప్రకటించిన సమయంలో తెలిసిన వాళ్లు నేను ఇంట్లో కూర్చోవాలని విడిపోయిన వాళ్లు ఐటం సాంగ్స్ చేస్తే బాగోదని చెప్పారని సామ్ పేర్కొన్నారు.

వైవాహిక బంధంలో నేను 100 శాతం నిజాయితీగా ఉన్నానని కాకపోతే అది వర్కౌట్ కాలేదని ఆమె తెలిపారు. నేనేదో నేరం చేసిన దానిలా దాక్కోవాల్సిన అవసరం ఏముందని సమంత ప్రశ్నించారు. నేను చేయని నేరానికి నన్ను నేను హింసించుకుని ఎందుకు బాధ పడాలని ఆమె అన్నారు. సమంత ఫ్యాన్స్ సైతం ఆమె కామెంట్లను సమర్థిస్తున్నారు.

నేను (Samantha) ఎన్నో బాధలు పడ్డానని మయోసైటిస్ వల్ల నాపై నాకే కంట్రోల్ లేకుండా పోయిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెలుతురును నా కళ్లు తట్టుకోలేవని సమంత  అన్నారు. ఎన్నో దాటుకుని ఈ స్థాయికి వచ్చానని ఎవరైనా నా లుక్స్ గురించి కామెంట్లు చేసినా పట్టించుకోనని ఆమె వెల్లడించారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus