క్యాస్టింగ్ కౌచ్ పై సమంత లేటెస్ట్ కామెంట్స్..!

  • May 14, 2020 / 09:00 PM IST

క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఉందని ఎంతో మంది ఫేడౌట్ అయిన హీరోయిన్లు.. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు మీడియా ముందుకు వచ్చి ‘మీటూ’ వంటూ వారి చేదు అనుభవాలను వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ళుగా తమలో దాచుకుంటున్న బాధను మీడియా ద్వారా అలాగే సోషల్ మీడియా ద్వారా.. వెల్లడించారు. బాలీవుడ్ నటి తను శ్రీ దత్తాతో మొదలైన ఈ ఉద్యమం ఇండియా మొత్తం పాపులర్ అయ్యింది. రాధికా ఆప్తే, చిన్మయి వంటి వారు కూడా…

మేము కూడా కొందరి వల్ల ఇబ్బంది పడ్డాం అని చెప్పారు. ఇక శ్రీ రెడ్డి అయితే చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఇలా పెద్ద వాళ్ళ పై ఆరోపణలు చేసిన తర్వాత వీరికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో మరిన్ని అనుమానాలకు దారి తీశాయి. ఇక స్టార్ హీరోయిన్ సమంత కూడా గాయని చిన్మయికి మద్దతు పలికింది. కానీ ఎక్కువగా ఈ అంశం పై మాట్లాడలేదు. ఇప్పుడు తాజాగా సమంత కూడా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది.

“ఇండస్ట్రీలో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఇద్దరూ ఉన్నారు. నాకు ఎంతో మంది మంచి వాళ్ళు మాత్రమే ఎదురయ్యారు కానీ చెడ్డవాళ్ళు ఎదురుకాలేదు.సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. ఒక్క సినీ ఇండస్ట్రీలోనే కాదు అన్ని ఇండస్ట్రీలలోనూ ఉంది. అయితే నేను మాత్రం క్యాస్టింగ్ కౌచ్ భారిన పడలేదు” అంటూ ఈ అక్కినేని వారి ఇంటి కోడలు చెప్పుకొచ్చింది.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus