Samantha: సమంత వంటి పై 3 టాటూలు.. అలాంటి ఆలోచన ఉంటే మానుకోమంటూ రిప్లై..!

తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత మెల్లమెల్లగా బాలీవుడ్ వైపు కూడా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ‘ది ఫ్యామిలీ మెన్2’ వెబ్ సిరీస్, ‘పుష్ప’ లో ‘ఉ అంటావా ఉఊ అంటావా’ వంటి ఐటెం సాంగ్స్ తో అక్కడి జనాలకి ఈమె బాగా దగ్గరైంది.త్వరలో హాలీవుడ్ ప్రాజెక్టుతో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇదిలా ఉండగా.. సమంత సోషల్ మీడియాలో అభిమానులతో చిట్‌చాట్‌ చేసి చాలా కాలం అయ్యింది.

Click Here To Watch NOW

దీంతో తాజాగా ఆమె చిట్ చాట్ సెషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పింది.’మీరు థియేటర్‌లో చూసిన ఫస్ట్‌ మూవీ ఏది?’ అంటూ ఓ నెటిజన్‌ అడగ్గా.. ‘జురాసిక్‌ పార్క్‌’ అంటూ సమాధానం ఇచ్చిన సమంత.. అటు తర్వాత తన తొలి సంపాదన ఎంత అనే ప్రశ్నకి కూడా బదులిచ్చింది.’హోటల్‌లో హోస్టెస్‌గా ఎనిమిది గంటలు పని చేసినందుకు గాను ఆమెకి రూ.500 ఇచ్చారని తెలిపింది.

ఇదే క్రమంలో ఓ నెటిజన్.. ‘మీరు ఎప్పటికైనా వేయించుకోవాలనుకునే టాటూ ఏది? అని ప్రశ్నించాడు.దీనికి సామ్.. ‘ భవిష్యత్తులో నేను టాటూలే వేయించుకోకూడదని డిసైడ్ అయ్యాను. అలాంటి ఆలోచన కనుక మీకు ఉంటే అది మానుకోండి’ అంటూ బదులిచ్చింది.గతంలో సమంత 3 టాటూలు వేయించుకుంది.తన మాజీ భర్త చైతన్యతో కలిసి నటించిన మొదటి సినిమా ‘ఏ మాయ చేశావె’ కి గుర్తుగా ‘YMC’ అనే అక్షరాలను తన వీపు పై పచ్చబొట్టుగా వేయించుకుంది.

రెండో టాటూ తన భర్త పేరుని తన నడుము పై భాగంలో చై అని వేయించుకుంది! అలాగే తన కుడి చేతి పై 2 యారో మార్కులు టాటూ వేయించుకున్న సామ్…తన మాజీ భర్త చైతన్య చేతి పై కూడా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇలా ఆ 3 టాటూలు కూడా చై జ్ఞాపకాలను మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తున్నాయి అనుకుంట అందుకే ‘టాటూల జోలికి పోవద్దు’ అంటూ సామ్ చెప్పినట్టు నెటిజన్లు భావిస్తున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus