అభిమానులకు షాక్ ఇచ్చిన సమంత
- July 11, 2017 / 10:42 AM ISTByFilmy Focus
అందం, అభినయానికి తోడు అదృష్టం కలిస్తే.. ఆమె సమంత. సినిమాలోకి వచ్చిన కొత్తలోనే వరుస హిట్లు అందుకొని స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా అవకాశం పట్టేసిన ఈ సుందరి త్వరలో అక్కినేని ఇంట పెద్ద కోడలిగా అడుగు పెట్టబోతోంది. నాగ చైతన్యతో ప్రేమలో పడిన సమంత.. ఇద్దరూ పెద్దలను ఒప్పించి జనవరిలో ఉంగరాలు మార్చుకున్నారు. అక్టోబర్ 6 న భార్య భర్తలు కాబోతున్నారు. ఈ క్షణాలను సమంత ఎలా ఫీలవుతుందో అని ఆలోచన ప్రతి ఒక్కరికీ వస్తుంది. ఇదే ప్రశ్నని ఆమె ముందు ఉంచారో అభిమాని. నిన్న ట్విట్టర్ వేదికపై అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన పలు ప్రశ్నలకు క్యూట్ గా సమాధానం చెప్పింది.
‘చైతూని పెళ్లి చేసుకోబోతున్నారు కదా? ఆ ఫీలింగ్ ఎలా ఉంది’ అని ఓ అభిమాని ప్రశ్నిస్తే.. ‘‘చైతూకీ నాకూ ఎప్పుడో పెళ్లయిపోయింది.” అంటూ షాకిచ్చింది. “మా వూహల్లో మా ఇద్దరికీ ఎప్పుడో పెళ్లి అయిపోయింది. మా పెళ్లి గురించి మాకు తప్ప మిగిలిన వాళ్లకే ఉత్సాహం ఎక్కువగా ఉన్నట్టుంది’’ అని చమత్కరించింది. పెళ్లి తర్వాత చైతన్యతో కలిసి సినిమాలు చేస్తారా? అనే మరో ప్రశ్నకు సమంత స్పందిస్తూ ఇస్తూ ‘ఎస్’ అని సమాధానం ఇచ్చింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














