Samantha: కొత్త సినిమా సైన్ చేసిన సామ్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల తన భర్త నాగచైతన్య నుంచి విడిపోతున్నట్లు అనౌన్స్ చేసింది. దీంతో టాలీవుడ్ ఒక్కసారిగా షాకైంది. ఈ క్రమంలో సమంతపై దారుణమైన రూమర్లు కూడా వినిపించాయి. తన స్టైలిస్ట్ తో ఆమెకి ఎఫైర్ ఉందని, ప్రెగ్నన్సీ తీయించుకుందని ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా రూమర్లు వచ్చాయి. వీటన్నింటినీ తిప్పికొట్టింది సమంత. తనపై వస్తోన్న తప్పు వార్తలను ఖండించింది. అయినప్పటికీ ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడలేదు.

ఇదిలా ఉండగా.. కెరీర్ పరంగా సమంత బిజీ అవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో వరుస సినిమాలు సైన్ చేస్తోంది. ఇప్పటికే తెలుగులో ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయబోతుంది. లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించబోతున్నారు. నవంబర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. దీంతో పాటు సమంత మరో సినిమా ఒప్పుకుందట. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ తో సమంతకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.

దీంతో ఆమెని వెతుక్కుంటూ చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ సమంత దేనికి ఓకే చెప్పలేదు. తాజాగా ఈ బ్యూటీ ఓ హిందీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దసరా తరువాత ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రాబోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కోలీవుడ్ లో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus