కొంత కాలంగా సోషల్ మీడియాలో మారో మోగుతున్న పేరు సమంత. సినిమాల విషయాలపై కాదు.. తన ప్రేమ, పెళ్లి సంగతులతో నెటిజనులు బాగా దగ్గరయింది. ప్రస్తుతం ఆమె చేస్తున్న ఒకే ఒక సినిమా “జనతా గ్యారేజ్”. హిట్ డైరక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా ఈ ముద్దుగుమ్మ ఆడి పాడింది. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక ఈ రోజు శిల్పకళా వేదికలో ఘనంగా జరగనుంది.
ఈ కార్యక్రమానికి సమంత హాజరు కావడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. “నాకు బాగాలేదు. అందుకే జనతా గ్యారేజ్ ఆడియో వేడుకను మిస్ అవుతున్నా” అంటూ ట్వీట్ చేసింది. నిన్నటి దాకా సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ కోసం డిజైనర్ నీరజ్ కోన తో కలిసి చక్కగా ఫోటో షూట్ లో పాల్గొన్న ఈ భామకు ఇంతలో ఏమైంది? అని నెటిజనులు అవాక్ అవుతున్నారు. ఆమె వాలకం చూస్తుంటే పెళ్ళికి ముందే చిత్ర పరిశ్రమకు టాటా చెప్పేట్టు ఉందని అనుకుంటున్నారు. ఎప్పుడు తన సినిమాల ఆడియో ఫంక్షన్లకు, ప్రమోషన్లకు ముందుండే ఈ క్యూట్ సుందరి, మీడియా వాళ్లు పెళ్లి విషయం పై అడుగుతారని భయపడే రావడం లేదని సినీ ప్రముఖులు భావిస్తున్నారు.
Not doing so well today 😭Miss you at the audio😘 #JanathaGarage #amaze #audioout
— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) August 12, 2016