మహానటి కోసం డబ్బింగ్ చెబుతున్న సమంత.!

  • April 5, 2018 / 06:15 AM IST

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత తెలుగు చక్కగా మాట్లాడగలదు. అయితే తన తొలిచిత్రం ఏ మాయ చేసావే కి గాయని చిన్మయి డబ్బింగ్ చెప్పింది. ఆమె గొంతు సమంతకి సూపర్ గా సెట్ అయింది. పైగా సినిమా సూపర్ హిట్. దీంతో చిన్మయిని సమంత వదులుకోలేదు. వీరిద్దరి వృత్తిగత, వ్యక్తిగత స్నేహం ఎనిమిదేళ్లుగా కొనసాగుతోంది. మహానటి సినిమా వీరి ప్రొఫిషినల్ బాండింగ్ ని బ్రేక్ చేసింది. అభినేత్రి సావిత్రి జీవిత చరిత్రను

నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. వైజయంతీ మూవీ బ్యానర్ పై అశ్వినీదత్, స్వప్నదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రను పోషించింది. దుల్గర్ సల్మాన్ జెమిని గణేషన్ పాత్రలో కనిపించబోతున్నాడు. సమంత జర్నలిస్ట్ గా నటించింది. గత నెలలో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. డబ్బింగ్ కూడా మొదలెట్టారు. ఇందులో సమంత తన పాత్ర కోసం సొంతంగా డబ్బింగ్ చెప్పుకోనున్నట్లు తెలిసింది. సీరియస్ సినిమాలో చిన్మయి గొంతుకంటే సమంత రియల్ వాయిస్ బాగుంటుందని నాగ్ అశ్విన్ చెప్పడంతో సొంతంగా డబ్బింగ్ కి సిద్ధమవుతున్నట్లు టాక్. దీని తర్వాత తన సినిమాలకు సమంత సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేము. మోహన్ బాబు, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, క్రిష్ తదితరులు నటిస్తున్న మహానటి వచ్చే నెలలో రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus