ఇండియన్ ఎంటర్‌టైన్మెంట్ సర్కిల్స్‌లో గత కొన్ని నెలలుగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తూ, మోస్ట్ ఎంటర్‌టైన్మెంట్‌గా మారిన ఓ టాపిక్ ముగియనుందా? ఏమో నిన్న రాత్రి నుండి వస్తున్న వార్తలు, ఈ టాపిక్‌లో కీలకమైన ముగ్గురిలో ఒకరు చేసిన సోషల్ మీడియా పోస్టు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. టైటిల్ చూసే వార్తలోకి వచ్చి ఉంటారు కాబట్టి.. ఆ టాపిక్ సమంత (Samantha) – రాజ్ నిడిమోరు (Raj Nidimoru) టాపిక్ అని మీకు తెలిసే ఉంటుంది. ఇక ఆ మూడో వ్యక్తి రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి.
అంత సీరియస్ మ్యాటర్‌ను ఎంటర్‌టైన్మెంట్ అని ఎలా అంటారు అనొచ్చు. మరి ఈ మొత్తం విషయాన్ని సమంత అండ్ కో. హ్యాండిల్ చేస్తుంది అలానే మారి. ఆ విషయం తర్వాత చూద్దాం కానీ.. ఇప్పుడు అసలు విషయానికొస్తే.. అగ్ర కథానాయిక సమంత పెళ్లంటూ గత కొన్ని నెలలుగా వార్తలు, ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొన్నీమధ్య దీపావళికి సమంత (Samantha) ఇంటికి రాజ్ నిడిమోరు వచ్చారు కూడా. అయితే వాళ్ల పెళ్లి ఈ రోజే (డిసెంబరు 1) అంటూ ఓ ప్రచారం ఇప్పుడు జరుగుతోంది.
బెంగళూరులోని ఈశా సెంటర్‌లో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. ఈశా వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ కార్యక్రమాల్లో సమంత పాల్గున్నారు. దీంతో అక్కడే వివాహం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. వీరి పెళ్లికి అతి తక్కువ మంది అతిథులు హాజరయ్యారని సమాచారం. ఈ నేపథ్యంలో రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్‌లో యాక్టివ్‌గా ఉండే ఆమె ఒక చిన్న నోట్ షేర్ చేశారు. ‘‘తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు’ అని ఆ పోస్ట్ సారాంశం. దీంతో ఇప్పుడు ఆ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. సమంత (Samantha), రాజ్ (Raj Nidimoru) పెళ్లి గురించే శ్యామాలి అలా రాశారు అని అంటున్నారు నెటిజన్లు. కామెంట్లలో కూడా అదే కనిపిస్తోంది.