Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరెకెక్కిన పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామా ‘జన నాయగన్’ (Jana Nayakdu). వాస్తవానికి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనేక వివాదాలు, సెన్సార్ సమస్యలు వంటి ఇతర కారణాల వల్ల.. రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. విజయ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఈ సినిమా రిలీజ్ కి వెంటనే గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతో ఓ దశలో ఈ సినిమా రిలీజ్ కాదేమో అని అంతా అభిప్రాయపడ్డారు.

Jana Nayakudu Collections

మొత్తానికి అన్ని అడ్డంకులు దాటి జూలై 23న విడుదల అయ్యింది. తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో రిలీజ్ అయ్యింది. బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి ఇది రీమేక్. అయినప్పటికీ విజయ్ (Vijay) నటించిన ఆఖరి సినిమా కావడంతో.. ఈ సినిమాని కచ్చితంగా థియేటర్లలో చూడాలని కొంతమంది ప్రేక్షకులు డిసైడ్ అయ్యారు. తెలుగులో కూడా ‘జన నాయకుడు’ (Jana Nayakdu) గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

అయితే మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ వీకెండ్ వరకు ఓకే ఓకే అనిపించేలా కలెక్ట్ చేసింది.కానీ వీక్ డేస్ లో మరింతగా తగ్గాయి. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 2.81 cr
సీడెడ్ 0.27 cr
ఉత్తరాంధ్ర 0.53 cr
ఈస్ట్ 0.35 cr
వెస్ట్ 0.24 cr
కృష్ణా 0.48 cr
గుంటూరు 0.38 cr
నెల్లూరు 0.26 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 5.32 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్ 0.16 cr
వరల్డ్ వైడ్ టోటల్(తెలుగు వెర్షన్) 5.48 cr(షేర్)

‘జన నాయకుడు’ (Jana Nayakdu) చిత్రం తెలుగు వెర్షన్ కి ప్రపంచవ్యాప్తంగా రూ.9.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.10 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.5.48 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.9.45 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.4.52 కోట్ల షేర్ ను రాబట్టాలి.

ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

 

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus