PRABHAS: ప్రభాస్ సినిమాలకు డిమాండ్ లేదా? ఆ డీల్స్ ఎందుకు ఆగినట్లు?

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ డైరీలో ఖాళీ పేజీలు దొరకడం కష్టంగా మారింది. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్లో పెడుతూ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. వచ్చే ఏడాది బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ చిత్రాలతో సిద్ధంగా ఉన్నారు. అయితే బాక్సాఫీస్ దగ్గర ఇంత హడావిడి ఉన్నా, బిజినెస్ సర్కిల్స్ లో మాత్రం ఒక ఆసక్తికరమైన విషయం చర్చకు వస్తోంది. ప్రభాస్ క్రేజ్ పీక్స్ లో ఉన్న ఈ టైమ్ లో, ఆయన అప్ కమింగ్ సినిమాల డిజిటల్ రైట్స్ ఇంకా అమ్ముడుపోలేదట.

PRABHAS

సాధారణంగా ప్రభాస్ సినిమా అనౌన్స్ మెంట్ రాగానే ఓటీటీ సంస్థలు క్యూ కడతాయి. బ్లాంక్ చెక్ ఆఫర్ చేస్తాయి. కానీ సంక్రాంతికి రాబోతున్న మారుతి సినిమా ‘రాజా సాబ్’, ఆగస్టులో రాబోతున్న హను రాఘవపూడి ‘ఫౌజీ’ చిత్రాల డిజిటల్ డీల్స్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని టాక్. దీనికి కారణం డిమాండ్ లేకపోవడం కాదు, నిర్మాతల పక్కా ప్లానింగ్ అని తెలుస్తోంది. మార్కెట్ లో బజ్ పెరిగాక, రికార్డు స్థాయి ధర పలికే వరకు ఆగాలని వారు డిసైడ్ అయ్యారట.

‘రాజా సాబ్’ విషయానికి వస్తే, ఇది హారర్ కామెడీ ఎంటర్టైనర్ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే ఓటీటీ సంస్థలతో చర్చలు పూర్తయ్యాయని, కేవలం ఫైనల్ అగ్రిమెంట్ మీద సంతకాలు మాత్రమే మిగిలి ఉన్నాయని సమాచారం. సరైన టైమ్ చూసుకుని ఈ డీల్ ను అఫీషియల్ గా క్లోజ్ చేయనున్నారు. బహుశా టీజర్ రిలీజ్ అయ్యాక రేటు ఇంకా పెంచొచ్చనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు టాక్.

ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఫౌజీ’ పరిస్థితి కూడా అలాగే ఉంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కాబట్టి విజువల్స్ పరంగా భారీగా ఉంటుంది. షూటింగ్ దశలోనే బిజినెస్ క్లోజ్ చేయాలని మైత్రీ వాళ్లు అనుకున్నా, ఓటీటీ సంస్థలు ఇంకా ఫైనల్ రేట్ కు రాలేదని తెలుస్తోంది. చర్చలు జరుగుతున్నాయి కానీ, నిర్మాతలు ఆశించే ఫిగర్ ఇంకా లాక్ అవ్వలేదు. ప్రభాస్ స్టామినా మీద నమ్మకంతో వారు వెనక్కి తగ్గడం లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus