Samantha: తన సినిమాకి ఎగ్గొట్టేసి.. ఇప్పుడు ఆ సినిమా కోసం వస్తుంది..!

  • November 2, 2023 / 01:36 PM IST

సమంత.. గతేడాది చివర్లో మాయోసైటీస్ అనే వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ వ్యాధి వల్ల ఆమె ఎక్కువగా తలనొప్పి, మోకాళ్ళ నొప్పులు, ఆయాసంతో బాధపడుతుంది. అలాగే ఈమె ఎక్కువ సేపు నిలబడలేదు కూడా! కొంచెం జలుబు, జ్వరం వంటివి వచ్చినా ఆమె రెండు రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే ఆమె సినిమాలు తగ్గించింది. అలాగే ప్రమోషన్లకు కూడా ఈమె ఎక్కువగా రావడం లేదు.

ముఖ్యంగా మీడియా ఇంటరాక్షన్ వంటి వాటికి సమంత దూరంగా ఉండాలని భావిస్తుంది. ఎందుకంటే ఆమె పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టేస్తారు అనే ఉద్దేశంతో కావచ్చు. ‘ఖుషి’ సినిమా ప్రమోషన్స్ విషయంలో సమంత.. మీడియా ముందుకు రాలేదు. కామ్ గా ఓ మ్యూజికల్ కాన్సర్ట్ కి వచ్చి తన వంతు ప్రమోషన్ ను ముగించేసి విదేశాలకి వెళ్ళిపోయింది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే మరోపక్క పలు కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొన్న సంగతి తెలిసిందే.

అయితే ఊహించని విధంగా (Samantha) సమంత ఈసారి మీడియా ముందుకు రాబోతుంది. ‘ఆమె సినిమాలు ఇప్పుడేమీ రిలీజ్ కి లేవు కదా.. ఆమె ఎందుకు మీడియా ముందుకు వస్తుంది?’ అనే డౌట్ అందరికీ రావచ్చు. దీనికి కారణం వేరే ఉంది. దీపావళి కానుకగా నవంబర్ 10 న రిలీజ్ కాబోతున్న ‘ది మార్వెల్స్’ అనే హాలీవుడ్ చిత్రాన్ని సమంత ప్రమోట్ చేస్తుంది. అందుకే మీడియా ముందుకు రాబోతుంది సమంత. మరి ఆమెకు ఈసారి ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. నవంబర్ 3 న ఈ ప్రెస్ మీట్ ఉండబోతుంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus