టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత.. నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు గుడ్ బై చెబుతుందని అందరూ అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్య పరుస్తూ.. మరింత బిజీ అయింది. తమిళంలో సూపర్ డీలక్స్, సెమ్మ రాజాలలో హీరోయిన్ గా నటిస్తోంది. యూటర్న్ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది. యూటర్న్ షూటింగ్ పూర్తి చేసుకోగా.. మిగిలిన రెండు సినిమాలు కూడా షూటింగ్ చివరి దశలో ఉంది. వీటి తర్వాత
“నిన్నుకోరి” హిట్ తో మంచి పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో పని చేయనున్నారు. హరీశ్ పెద్ది, సాహు గారపాటి కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమాలో సమంత, నాగచైతన్య కు భార్య భర్తల్లా నటించనున్నారు. ‘ఏ మాయ చేశావే’ .. “ఆటో నగర్ సూర్య” .. “మనం ” చిత్రాల్లో నటించిన ఈ జంట పెళ్లి తర్వాత చేస్తున్న మొదటి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉంది. అయితే హీరోయిన్ గా సమంతకి ఇదే ఆఖరి మూవీ అని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఆ చిత్రం తర్వాత నటనకు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ మధ్య సమంత ఏ కొత్త సినిమాకి సంతకం చేయకపోవడం ఈ వార్తకు బలాన్ని చేకూర్చుతోంది. సమంత పిల్లల్ని కనాలని ఒత్తిడి రోజురోజుకి పెరిగిపోతున్నట్లు సమాచారం. అందుకే నటనకు కొంతకాలం బ్రేక్ ఇచ్చి అమ్మ తనాన్ని ఆస్వాదించాలని నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఈ రూమర్ పై సమంత ఏమని సమాధానం ఇస్తుందో చూడాలి.