సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళు కాస్త ఆలోచించి మాట్లాడకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే మీడియా ముందు ఆచి తూచి ఆలోచించి మాట్లాడాలి అంటారు. ఇదిలా ఉంటే తాజాగా సమంత విషయంలో జరిగిన తప్పు ఆమె పర్సనల్ లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇంతకీ ఎం జరిగింది…అంటే..అందాల భామ సమంత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని, త్వరలోనే పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని, ఉందని, పిల్లలు అంటే నాకు ఎంతో ఇష్టం, పిల్లలను కనాలని ఉందని పొరపాటున నోరు జారింది.
ఇక కాస్త తెలివిగా…సమంత తన ప్రయుడు ఎవరు? అనే విషయం మాత్రం బయట పెట్టలేదు. ఇక సమంత నోటి నుండి పెళ్లి విషయం వచ్చినప్పటి నుండి మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. ట్విటర్ వేదికగా…అభిమానులు కూడా ఆమెను ట్విట్టర్లో పెళ్లి గురించిన ప్రశ్నలు, మీ బాయ్ ఫ్రెండ్ ఎవరు? అనే ప్రశ్నలతో విసిగిస్తున్నారు.
ఇక దీనిపై క్లారిటీ ఇస్తూ…తాను చెప్పే వరకు పెళ్లి మాట ఎత్తొద్దని అభిమానులను, మీడియాను కోరుతూ… ట్వీట్ చేసింది. సమంత స్పందన చూస్తుంటే… ఇటీవల ఇంటర్వ్యూలో ప్రియుడి గురించి, పెళ్లి గురించి అనవసరంగా మాట్లాడానని ఫీలవుతున్నట్లు స్పష్టమవుతోంది. సమంత స్వయంగా తన ప్రేమ విషయాన్ని లీక్ చేసి ఇపుడు ఇలా ఇబ్బందుల్లో పడింది. అయితే మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకుని ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా బేబీ…