జనరల్ గా.. ఒక పాపులర్ సాంగ్ లేదా సీన్ లోని డైలాగ్ నుంచి స్పూర్తి పొంది వేరే హీరోలు లేదా దర్శకులు తమ సినిమాలకు టైటిల్స్ పెట్టుకుంటారు. కానీ.. బహుశా మొదటిసారిగా తన సినిమాలో తనకు బాగా పేరొచ్చిన పాటలోని పల్లవిని టైటిల్ గా ఒక హీరోయిన్ పెట్టించుకోవడం అనేది సమంత విషయంలో జరుగుతోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో కొరియన్ డ్రామా ఆధారంగా ఓ చిత్రంలో నటిస్తున్న సమంత ఆ చిత్రానికి అడిగి మరీ “ఓ బేబీ” అనే టైటిల్ పెట్టించుకొందట. “రంగస్థలం” చిత్రంలోని ఎంత సక్కగున్నవే సాంగ్ ను స్ఫూర్తిగా తీసుకొని “ఎంత సక్కగున్నవే” అనే పల్లవిని ట్యాగ్ లైన్ గా పెట్టుకొంది.
ఈ చిత్రంలో సమంత రెండు వైవిధ్యమైన షేడ్స్ లో కనిపించనుంది. 70 ఏళ్ల భామగా, 20 ఏళ్ల పడుచుగా ఈ చిత్రంలో సమంత కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రోడక్షన్స్ పతాకంపై సురేష్ బాబు నిర్మిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవ్వనుంది. ఇవి కాకుండా మరో రెండు క్రేజీ ప్రొజెక్ట్స్ సమంత చేతిలో ఉన్నాయి. పెళ్లయ్యాక కూడా సమంత చూపుతున్న స్పీడ్ కి మిగతా హీరోయిన్స్ షాక్ అవుతున్నారు.