సమంత యూ టర్న్ విశేషాలు!

  • June 2, 2018 / 03:44 AM IST

రోడ్లమీద కంటే జీవితంలోను ఊహించని మలుపులు ఉంటాయి. గమ్యానికి చేరుకోవాలంటే ప్రతి మలుపుని జాగ్రత్తగా అధిగమిస్తూ రావాలి. అలాగే సమంత తన సినీ కెరీర్ లో అనేక విజయాలను సొంతంచేసుకుంది. వ్యక్తిగత జీవితంలోను ప్రియమైన వాటిని సొంతంచేసుకుంది. అటువంటి వాటిలో నాగచైతన్యని దక్కించుకోవడం. టార్గెట్ రీచ్ కాగానే రిలాక్స్ అవ్వకుండా కొత్త లక్ష్యాలను పెట్టుకొని శ్రమిస్తోంది. నిత్యం జిమ్ ల్లో కసరత్తు చేసే సమంత రీసెంట్ గా పదికిలోల బరువుని వీపుపై పెట్టుకొని వ్యాయామం చేసి యువతకి ఆదర్శంగా నిలిచింది. అంతేకాదు ‘‘నా దృష్టిలో ఫిట్‌నెస్‌ అంటే ఎట్రాక్టివ్‌గా కనిపించేందుకు చేసే వర్క్‌ కాదు.

క్రమశిక్షణ, గౌరవం, ఆత్మవిశ్వాసం.. ఇవన్నీ ఎక్స్‌ర్‌సైజ్‌ వల్ల ఏర్పడతాయి’’ అనే స్టేట్మెంట్ తో అదరగొట్టింది. అలాగే కమర్షియల్ సినిమాలతో బిజీగా ఉన్న బ్యూటీ కంటెంట్ ఉన్న కథలో నటిస్తోంది. కన్నడ హిట్‌ మూవీ ‘యు టర్న్‌’ ని తెలుగు, తమిళంలో చేస్తోంది. ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్, భూమిక తదితరులు నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. ఎండలను సైతం లెక్క చేయకుండా రోడ్లపై షూటింగ్ లో సమంత పాల్గొంటోంది. ఈ షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక సమంత విశాల్ తో కలిసి నటించిన అభిమన్యుడు మూవీ నేడు రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus