టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన నాగార్జున ది ఘోస్ట్ సినిమా ఫ్లాప్ తర్వాత కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రసన్న కుమార్ డైరెక్షన్ లో నాగ్ హీరోగా ఒక సినిమా ఫిక్స్ అయినా ప్రసన్న కుమార్ టేకింగ్ నచ్చకపోవడంతో నాగ్ నిర్ణయం మారిందని తెలుస్తోంది. కెరీర్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి నాగ్ సిద్ధంగా లేరు. నాగ్ రెమ్యునరేషన్ సైతం తగ్గిందని తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్6 కు ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రాకపోవడంతో నాగ్ సైతం బిగ్ బాస్ సీజన్7 కు దూరంగా ఉండనున్నారని సమాచారం అందుతోంది.
నాగార్జున సినిమా ప్రసన్నకుమార్ కథతోనే తెరకెక్కనుందని అయితే డైరెక్టర్ ఫిక్స్ కావాల్సి ఉందని సమాచారం. ఈ సినిమాకు దర్శకత్వం వహించే లక్కీ ఛాన్స్ ఎవరి సొంతమవుతుందో చూడాల్సి ఉంది. కెరీర్ విషయంలో నాగ్ ఇతర హీరోలకు భిన్నంగా అడుగులు వేస్తున్నారు. నాగార్జున మల్టీస్టారర్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. చాలామంది డైరెక్టర్లు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు.
మలయాళ సినిమా పాయింట్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. నాగ్ వయస్సు ప్రస్తుతం 63 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అజయ్ భూపతి పేరు వార్తల్లోకి వచ్చినా ఆ వార్త నిజం లేదని తెలుస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్లకు నాగ్ ఎక్కువగా ఛాన్స్ ఇస్తున్నా నాగ్ నమ్మకాన్ని నిలబెట్టుకునే విషయంలో దర్శకులు ఫెయిల్ అవుతున్నారు.
నాగార్జునకు (Nagarjuna) ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. క్లాస్ రోల్స్ అయినా, మాస్ రోల్స్ అయినా తన వంతు న్యాయం చేసే విషయంలో నాగ్ ముందువరసలో ఉంటారు. నెగిటివ్ కామెంట్లను పట్టించుకోకుండా నాగార్జున ముందడుగులు వేస్తున్నారు. కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా నాగ్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.