Prabhas, Sandeep Reddy Vanga: ప్రభాస్‌ సినిమా కోసమే వంగ ఈ మార్పు చేస్తున్నాడా?

రణ్‌బీర్‌ కపూర్‌ సినిమా రిలీజ్‌ ప్రకటించడంతో… ప్రభాస్‌ సినిమాపై కాస్త క్లారిటీ వచ్చింది. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా? కానీ జరిగిందిదే. కారణం ఆ రెండు సినిమాలకు దర్శకుడు ఒకరే కాబట్టి. అవును మేం చెబుతోంది ‘స్పిరిట్‌’ సినిమా గురించే. సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించనున్న ఈ సినిమా గురించి ఇటీవల అనౌన్స్‌మెంట్‌ కూడా వచ్చింది. అయితే ప్రభాస్‌ బిజీ లైనప్‌, దర్శకుడు సందీప్‌ లైనప్‌ చూసి ఇంత త్వరగా సినిమా కష్టమే అనుకున్నారంతా.

రణ్‌బీర్‌ కపూర్‌ ‘యానిమల్‌’ సినిమాను 2023 ఆగస్టు 11న విడుదల చేస్తున్న చిత్రబృందం ప్రకటించింది. అంటే వచ్చ ఏడాది సందీప్‌ రెడ్డి వంగా ఖాళీనే. అంటే ఆ సమయంలోనే ప్రభాస్‌ సినిమా కంప్లీట్‌ చేస్తాడన్నమాట. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఇదే చ్చ నడుస్తోంది. ‘స్పిరిట్‌’ కోసం ‘యానిమల్‌’ లేట్‌ చేస్తున్నారు అని కొందరు, ‘యానిమల్‌’ లేట్‌ అవుతుంది కాబట్టే ‘స్పిరిట్‌’ ముందుకొచ్చిందని కొందరు అంటున్నారు. అయితే ఇక్కడే మూడో రకం ఆప్షన్‌ కూడా ఉంది.

అదే పారలల్‌ షూటింగ్‌. ప్రభాస్‌ లైనప్‌ చాలా బిజీగా ఉండటమే దీనికి కారణం. ప్రభాస్‌ చేతిలో ప్రస్తుతం ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’, ‘స్పిరిట్‌’ ఉన్నాయి. ‘ఆదిపురుష్‌’ పూర్తయిపోయింది. ఇవి కాకుండా బాలీవుడ్‌లో మరో రెండు సినిమాలు ఓకే అయ్యాయనే టాక్‌ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ లైనప్‌ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus