Mahesh Babu: ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడితో మహేష్ సినిమా.. ఇదిగో క్లారిటీ!

  • November 26, 2023 / 07:16 PM IST

వాస్తవానికైతే ‘మహర్షి’ తర్వాత మహేష్.. సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా, ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా చేయాలి. సుకుమార్ చెప్పిన కథ మహేష్ కి నచ్చలేదు. ఇంకా డిస్కషన్ స్టేజిలో ఉండగానే.. ఆ కథని తీసుకెళ్లి అల్లు అర్జున్ కి చెప్పి ఓకే చేయించుకున్నాడు సుకుమార్. ఇది మహేష్ కి కోపం తెప్పించింది. దీంతో వెంటనే ‘సుకుమార్ తో నేను సినిమా చేయడం లేదు’ అంటూ ఓ ట్వీట్ వేసేశాడు మహేష్.

అంతేకాదు ‘ఎఫ్ 2 ‘ తో హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చిన అనిల్ రావిపూడికి పిలిచి ‘సరిలేరు నీకెవ్వరు’ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు. ఆ బాధ్యతని అనిల్ చక్కగా నిర్వర్తించాడు. ఆ తర్వాత సందీప్ చెప్పిన స్క్రిప్ట్ మహేష్ కు పూర్తిగా నచ్చలేదు. అందుకే పరశురామ్ కి ఛాన్స్ ఇచ్చాడు. కానీ యానిమల్ ప్రమోషన్స్ లో సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్, అల్లు అర్జున్ ల తర్వాత మహేష్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందన్నట్టు చెబుతున్నాడు. ‘మహేష్ బాబుకి ఓ కథ చెప్పాను.

అది ఆయనకు నచ్చింది. కానీ మహేష్ కి ముందుగా కమిట్ అయిన ప్రాజెక్ట్స్ డిలే అయ్యాయి కాబట్టి.. అవి కంప్లీట్ అయ్యాక చేస్తాను’ అన్నట్టు సందీప్ చెప్పుకొచ్చాడు. కానీ సందీప్ కథ.. ‘మహేష్ కి నచ్చలేదు’ అని అతని టీం గట్టిగా చెబుతుంది. అయినా ‘సందీప్ బాగానే కవర్ చేసుకుంటున్నాడు’ అని వారు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus