‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ కు బాలీవుడ్లో మరో బంపర్ ఆఫర్?

Advertisement

మన టాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని ‘కబీర్ సింగ్’ గా బాలీవుడ్ ప్రేక్షకులకు అందించి.. బ్లాక్ బస్టర్ కొట్టాడు సందీప్ రెడ్డి వంగా. ఓ మీడియం రేంజ్ ఉన్న హీరోతో నెగిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ.. ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ కొట్టడం.. సాధారణ విషయం కాదు. బాలీవుడ్ ప్రేక్షకులకు సందీప్ రెడ్డి వంగా టేకింగ్ తెగ నచ్చేసింది. ప్రతీ షాట్ అద్భుతం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో బాలీవుడ్ లో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతేకాదు ఇప్పుడు సందీప్ రెడ్డి డైరెక్షన్లో సినిమా చేయాలని అక్కడి హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారట.

ఇదిలా ఉండగా ఇప్పుడో క్రేజీ వార్త బాలీవుడ్ మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో సందీప్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. టి-సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతుందట. సల్మాన్ తో పాటు నిర్మాతలతో కూడా సందీప్ కదా చర్చలు జరుపుతున్నాడట. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చేస్తారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయితే సందీప్ రెడ్డి వంగా క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉందనడంలో సందేహమే లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus