పవన్ కళ్యాణ్ తో పోటీకి దిగుతున్న బాలకృష్ణ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నటసింహ బాలకృష్ణ మధ్య యుద్ధం తప్పదని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. వచ్చే సంక్రాంతికి వీరి సినిమాల మధ్య వార్ జరుగబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. అజ్ఞాతవాసి అనే టైటిల్ అనుకుంటున్న ఈ సినిమాని  సంక్రాంతి సందర్భంగా జనవరి 10 రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత రాధాకృష్ణ అధికారికంగా ప్రకటించారు. పైసా వసూల్ తర్వాత బాలకృష్ణ  తమిళ డైరక్టర్ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో 102 వ సినిమాని పట్టాలెక్కించారు. ఇది వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని జనవరి 13 న విడుదల చేయడానికి నిర్మాత సి కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

సంక్రాంతి హీరో గా పేరు తెచ్చుకున్న బాలయ్య గతేడాది గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా ద్వారా తన పేరుని నిలబెట్టుకున్నారు. ఈ మూవీ మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమాని తట్టుకొని భారీ కలక్షన్స్ రాబట్టింది. ఈ సారి కూడా పవన్ కళ్యాణ్ సినిమా మూడు రోజుల ముందు రిలీజ్ అవుతోంది. అయినా పోటీ పడడానికి బాలయ్య మూవీ రంగంలోకి దిగుతోంది. ఈ సారి విజయం ఎవరి వంతు అవుతుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus