తమిళంలో గోపీచంద్ ఆఖరి హిట్!

  • October 21, 2017 / 02:26 PM IST

మన తెలుగు మాస్ హీరో గోపీచంద్ కు సరైన హిట్ దొరికి చాలా ఏళ్లవుతోంది. మనోడికి తెలుగులో లభించిన ఆఖరి హిట్ “లౌక్యం”, ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ డిజాస్ఱర్లుగా మిగిలాయి. అయితే.. ఇప్పుడు గోపీచంద్ ఆఖరి సూపర్ హిట్ ను తమిళనాట రీమేక్ చేస్తున్నారు. తమిళ స్టార్ కమెడియన్ సంతానం కథానాయకుడిగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇంతకుమునుపు తెలుగులో సూపర్ హిట్ అయిన “మర్యాద రామన్న” చిత్రాన్ని కూడా తమిళంలో రీమేక్ చేసి హిట్ కొట్టిన సంతానం ఇప్పుడు “లౌక్యం” రీమేక్ తో మరో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.

ఒకపక్క కమెడియన్ గా స్టార్ హీరోల సరసన సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూనే మరోపక్క హీరోగానూ చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ పెద్ద హిట్లు కొడుతున్నాడు. హీరోగా-కమెడియన్ గా సంతానం కెరీర్ బ్యాలెన్సింగ్ ను చూసైనా కొందరు కమెడియన్ టర్నడ్ హీరోలు నేర్చుకోవాల్సింది చాలా ఉందన్న విషయాన్ని గ్రహిస్తే బెటర్. ఇకపోతే.. సంతానం హీరోగా నటించిన మరో చిత్రం “సర్వర్ సుందరం” కూడా త్వరలో రిలీజ్ అవ్వనుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus