Santosh Shoban: ‘లిప్ లాక్ సీన్స్ లో నటించడం అంత ఈజీ కాదు’

  • November 3, 2021 / 10:56 AM IST

యంగ్ హీరో సంతోష్ శోభన్ ఈ ఏడాది ‘ఏక్ మినీ కథ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ఈ హీరో నటించిన ‘మంచి రోజులు వచ్చాయి’ అనే సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు సంతోష్ శోభన్. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ జనరేషన్ హీరోలంతా రొమాంటిక్ సన్నివేశాల్లో అవలీలగా నటించేస్తున్నారు. కానీ సంతోష్ మాత్రం రొమాన్స్ లో వీక్ అంటున్నాడు. ముఖ్యంగా లిప్ లాక్ సన్నివేశాలు మరింత కష్టమని చెబుతున్నాడు. తనకు సిగ్గు ఎక్కువ అని.. అన్ని సీన్లు చేసినట్లే లిప్ లాక్ సీన్స్ లో కూడా నటించాలని అన్నారు. సెట్స్ లో అంతమంది వుండగా లిప్ లాక్ లాంటి సీన్లు చేయడం అంత తేలిక కాదని అన్నారు. ఓపెన్ గా లిప్ లాక్ చేయడం మన కల్చర్ కాదు కదా.. కొంచెం కష్టమే అని చెప్పుకొచ్చారు.

అయితే ఇలాంటి సీన్లు చేసేటప్పుడు చాలా టెక్నికల్, ప్రొఫెషనల్ గా చేసినప్పుడే వర్క్ ఈజీ అవుతుందని అన్నారు. తన తదుపరి సినిమా నందినిరెడ్డి డైరెక్షన్ లో ఉంటుందని చెప్పాడు. అలానే యూవీ క్రియేషన్స్ లో మరో సినిమా చేయబోతున్నట్లు చెప్పారు. ఇంకొన్ని సినిమాలు చర్చల్లో ఉన్నాయని తెలిపారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus