హౌస్ అరెస్ట్ థియేటర్స్ లో సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి కామెడీకి నవ్వులే నవ్వులు!!!

  • August 29, 2021 / 06:21 PM IST

నిర్మాణ సంస్థ‌, డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మించిన తొలి చిత్రంగా ‘హౌస్ అరెస్ట్‌’ ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. థియేట‌ర్స్‌లో ఆగ‌స్ట్ 27న‌ విడుదలైన ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, స‌ప్త‌గిరి, అదుర్స్ ర‌ఘు, ర‌విప్ర‌కాశ్‌, ర‌విబాబు, తాగుబోతు ర‌మేవ్‌, ఫ్ర‌స్టేటెడ్ సునైన‌, కౌశిక్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. శేఖ‌ర్ రెడ్డి యెర్ర ద‌ర్శ‌క‌త్వంలో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

ప్రస్తుతం థియేటర్స్ లొ సందడి చేస్తున్న ఈ సినిమాను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సప్తగిరి , శ్రీనివాస్ రెడ్డి కామెడీ ఈ సినిమాకు హైలెట్. ఒక ఇంట్లో జరిగే కథలో పిల్లలు పిల్లలతో సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెడీకి ప్రేక్షకులు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. చిన్న పెద్దా తేడా లేకుండా ఈ సినిమాను థియేటర్స్ లో వీక్షిస్తున్నారు. చాలా కాలం తరువాత చిన్న పిల్లల సినిమాగా హౌస్ అరెస్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus