దీపావళికి సప్తగిరి నటించిన ఇల్లుజన్ థ్రిల్లర్ ఎయిట్ టీజర్ !!!

  • November 3, 2021 / 05:32 PM IST

హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సప్తగిరి హీరోగా మారిన సంగతి తెలిసిందే. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో హీరోగా మారిన సప్తగిరి.. ఆ తరవాత ‘సప్తగిరి ఎల్ఎల్‌బి’, ‘వజ్రకవచధర గోవింద’ సినిమాల్లో హీరోగా నటించారు. ఒకవైపు కమెడియన్‌గా నటిస్తూనే మరోవైపు హీరోగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా మరో సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇది బహుభాషా చిత్రం కావడం విశేషం. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు, రిజ్వాన్ నిర్మాతగా వ్యవహారిస్తున్న ఈ సినిమా ద్వారా సూర్యస్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

దీపావళి సందర్బంగా ఈ చిత్ర టీజర్ ను నవంవర్ 4న విడుదల చేయబోతున్నారు. ఐదు భాషల్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొత్త డైరెక్టర్ సూర్యస్ విభిన్నమైన కాన్సెప్ట్ తో వస్తున్నారు.స్నేహ ఉల్లాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను నిర్మాత రిజ్వాన్ ఖర్చుకు వెనకాడకుండా భారీ బడ్జెట్ తో నిర్మించారు. పాన్ ఇండియా ఇల్లుజన్ థ్రిల్లర్ ఎయిట్ సినిమాకు సంభందించి మరిన్ని విషయాలు త్వరలో తెలియనున్నాయి.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus