Athulya Ravi: సప్తగిరి అత్యుత్సాహం.. ‘మీటర్’ హీరోయిన్ అతుల్య రవి ఫోన్ నెంబర్ లీక్ చేసేశాడు!

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘మీటర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఘనంగా జరిగింది. నిజానికి ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎక్కువగా నైట్ టైం జరుగుతూ ఉంటాయి. కానీ ఎందుకో ఈ ఈవెంట్ ను ఉదయమే నిర్వహించారు. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ‘మీటర్’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన కమెడియన్ సప్తగిరి..

ఈ వేడుకకు హాజరయ్యాడు.ఈ క్రమంలో ఎందుకో ఆయన కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించాడు. అతను స్పీచ్ ఇస్తున్న టైంలో హీరోయిన్ అతుల్య రవి గురించి ఫన్నీ కామెంట్స్ చేసిన సప్తగిరి.. అదే టైంలో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆమె ఫోన్ నెంబర్ లీక్ చేస్తానని అన్నాడు. సప్తగిరి ఫన్నీగా అంటుంటాడులే.. అని అంతా అనుకున్నారు. కానీ హీరోయిన్ అతుల్య రవి స్పీచ్ ఇస్తున్న టైంలో సప్తగిరి కూడా స్టేజి పైకి వెళ్ళిపోయి ఆమె ఫోన్ నెంబర్ చెప్పేశాడు.

దీనికి అతుల్య (Athulya Ravi) టెన్షన్ పడినప్పటికీ ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేకపోయింది అలాగే సప్తగిరిని కూడా కంట్రోల్ చేయలేకపోయింది. అయితే ఇదేదో ప్రాంక్ అయ్యుంటుంది. నిజంగా హీరోయిన్ నెంబర్ సప్తగిరి ఎందుకు లీక్ చేస్తాడు, అది రాంగ్ నెంబర్ అయ్యుంటుంది అని అంతా అనుకున్నారు. కానీ అది నిజంగానే హీరోయిన్ ఫోన్ నెంబర్ అట. హీరోయిన్ ఈ విషయాన్ని చిత్ర బృందంతో తెలుపగా.. వాళ్ళు ఆ నెంబర్ చెప్పిన టైం క్లిప్ ను డిలీట్ చేయించడానికి కిందా మీదా పడుతున్నారు.

లైవ్ లో సప్తగిరి నెంబర్ చెప్పేయడం వల్ల ఇప్పుడు ఆమెకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అతుల్య ఫోన్ నెంబర్ తోనే ఆమె పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ముడిపడి ఉన్నాయని తెలుస్తుంది. ఆమె ఫోన్ నెంబర్ మార్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు కానీ ఆధార్ వంటి వాటన్నిటిలో ఆమె మొబైల్ నెంబర్ మార్చుకోవాల్సి ఉంటుంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus